»   » హాలీవుడ్ డ్రగ్స్ కథ తెలుసా?: ఆ భయంతో గుండు కొట్టించుకుంది

హాలీవుడ్ డ్రగ్స్ కథ తెలుసా?: ఆ భయంతో గుండు కొట్టించుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత నాలుగు రోజులుగా టాలీవుడ్ మొత్తం డ్రగ్స్..! డ్రగ్స్..!! అంటూ హోరెత్తి పోతోంది. ఎప్పటి నుంచో రూమర్ గా మాత్రమే చలామనీ లో ఉన్న వార్తలు నిజమే అంటూ వెలుగు లోకి రావటం, అందులోనూ ఎవ్వరూ ఊహించని పెద్ద స్టార్ల పేర్లుండటం సినిమా ఇండస్ట్రీ నే కాదు మొత్తం అటు ఆంద్ర ప్రదేశ్ ఇటు తెలంగాణా రాష్ట్రాలని ఒక్క కుదుపు కుదిపేసింది. ఇంకా ఆ సెగలు పెరుగుతాయనీ, ఇంకొంతమంది పేర్లు బయటికి రానున్నాయనే ఆసక్తిని ఇటు మీడియా కూడా బాగానే వాడేస్తోంది....

బ్రిట్నీ విడాకుల సమయం లో

బ్రిట్నీ విడాకుల సమయం లో

అయితే ఇదంతా మనకు కొత్త గానీ బాలీవుడ్ లో సాధారణం... ఇక హాలీవుడ్ సంగతి ఇంకా చెప్పల్సిన అవసరమే లేదు... అలాంటిదే ఇప్పుడొక ఆసక్తి కరమైన విషయం ఒకటి ఈ సందర్భం లో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. భర్తతో విడిపోయిన బ్రిట్నీ స్పియర్స్ తన విడాకుల సమయం లో చేసిన వింత పని ఇప్పుడు బయటకు వచ్చింది.

గుండు కొట్టించుకుంది

గుండు కొట్టించుకుంది

పిల్లల సంరక్షణ తనకు అప్పగించాలని కోర్టులో పోరాడిన బ్రిట్నీ. తన పిల్లల సంరక్షణ కోర్టు తనకు ఇవ్వదేమో అన్న అనుమానం తో గుండు కొట్టించుకుంది. ఎందుకంటే అక్కడి చట్టాల ప్రకారం డ్రగ్స్ కి బానిసైన తల్లిదండ్ర్లకు పిల్లలని ఇవ్వటానికి చట్టాలు ఒప్పుకోవు...

విచారణలో తేలకుండా

విచారణలో తేలకుండా

గతంలో యాంఫిటమైన్ అనే డ్రగ్స్ వాడిన ఆమె, ఆ విషయం విచారణలో తేలకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుంది. డ్రగ్స్ తీసుకుంటే, దాని అవశేషాలు రక్తంలో నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి. లాలాజలంలో మూడు రోజుల వరకూ ఉండే యాంఫిటమైన్ అవశేషాలు, తలవెంట్రుకల్లో మాత్రం మూడు నెలల వరకూ ఉంటాయి.

యాంఫిటమైన్‌ డ్రగ్స్‌

యాంఫిటమైన్‌ డ్రగ్స్‌

అయితే కొన్నాళ్లపాటు యాంఫిటమైన్‌ డ్రగ్స్‌ వాడిన బ్రిట్నీ స్పియర్స్‌.. ఆ విషయం కోర్టుకు తెలిస్తే పిల్లల సంరక్షణ తనకు కాకుండా తన మాజీ భర్తకు అప్పగిస్తారేమోనని భయపడింది. యాంఫిటమైన్స్‌ అవశేషాలు కురుల్లో ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి నున్నగా గుండు కొట్టించుకుంది.

2007లో

2007లో

అసలు కారణం ఎవరికీ తెలియలేదు. 2007లో ఇది జరగ్గా.. 2012లో ఆమె లాయర్‌ బయటపెట్టింది. నిపుణులు తెలిపిన ప్రకారం.. యాంఫిటమైన్స్‌ వాడితే లాలాజలంలో ఆ అవశేషాలు 72 గంటల దాకా ఉంటాయి. రక్తంలో 2 నుంచి 4 రోజుల దాకా, వెంట్రుకల్లో 90 రోజుల దాకా ఉంటాయి. కొకైన్‌, హెరాయిన్‌, మారిజువానా, ఎక్స్‌టసీ.. ఇలా ఏ డ్రగ్‌ వాడినా అవశేషాలు 90 రోజుల దాకా ఉంటాయి.

English summary
Britney Spears shaved her head and flipped out on a car during her 2007 descent into madness amid a struggle for custody of her children.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu