»   » అకున్ సభర్వాల్ కే చార్మీ రివర్స్ నోటీస్??: టాలీవుడ్ మొత్తం ఇదే చర్చ

అకున్ సభర్వాల్ కే చార్మీ రివర్స్ నోటీస్??: టాలీవుడ్ మొత్తం ఇదే చర్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో డ్రగ్స్ రచ్చ మొదలైన దగ్గరినుంచీ చార్మీ మీద అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. నోటీసులందుకున్న మిగతా అందరి విషయం లో పెద్దగా ఆశ్చర్య పోని జనం ఆ లిస్ట్ లో చార్మీ పేరు కనిపించటం తో ఒకరకంగా షాక్ తిన్నారు. అయితే నెమ్మది నెమ్మది గా జీర్ణించుకున్నారు. విచారణలో నిజా నిజాలు తెలుస్తాయి కదా అన్న అభిప్రాయానికి వచ్చారు.డ్రగ్స్ ను నిర్మూలించాల్సిందేనని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రెస్ మీట్ పెట్టిమరీ ప్రకటించింది. ఈ క్రమంలో పరిశ్రమలో భాగమైన నిందితులంతా సిట్ అధికారుల ముందు హాజరై తమ వాదన వినిపిస్తున్నారు. కానీ ఇప్పుడు చార్మీ మాత్రం ఆ విచారణ పద్దతులకు ససేమిరా తలొగ్గేది లేదంటూ కోర్టుకెక్కింది...

ఛార్మీ డ్రగ్స్ సేవించిందా?

ఛార్మీ డ్రగ్స్ సేవించిందా?

ఛార్మీ హైకోర్టులో పలు షరతులతో తనను విచారించాలని కోరింది. దీంతో ఛార్మీ డ్రగ్స్ సేవించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ చార్మీ అభిమానులే కాదు ఇండస్ట్రీలో కూడా ఇప్పటికీ చార్మీ విషయంలో ఏదో పొరపాటు జరిగిందనీ, లేదంటే డ్రగ్స్ లిస్ట్ లో చార్మీ పేరు వచ్చేదనీ అన్న నమ్మకం తోనే ఉన్నారు.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3

ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3

ఒక వేళ డ్రగ్స్ తీసుకుందని నిరూపణ అయితే ఆమెకు అవకాశాలు తగ్గడంతో పాటు ఆమె పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని ఛార్మీ భావిస్తోంది. అందుకే ఈ కోర్టూ నోటీసులూ అంటున్న వాళ్ళు లేకపోలేదు.. మిగతా అంతా విచారణకు హాజరవుతోంటే చార్మీ మాత్రం తనకు ఇష్టం లేకుండా బ్లడ్ శాంపిల్ ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ, ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3ని ఆమె ఉదహరించింది.

అనుమానితుల అనుమతితో

అనుమానితుల అనుమతితో

భారత రాజ్యాంగంలోని ఈ సెక్షన్ నార్కోటిక్స్ చట్టాలను ప్రస్తావిస్తుంది. దీనిలోని వివరాల ప్రకారం, కేసులో పట్టుబడ్డ నిందితులు, అనుమానితులను వారి అనుమతితో థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా, లై డిటెక్షన్, పాలీ గ్రఫీ తదితర టెస్టులతో పాటు, రక్త నమూనాల సేకరణ ద్వారా సాక్ష్యాలను సేకరించవచ్చు.

లిఖితపూర్వక అనుమతి

లిఖితపూర్వక అనుమతి

అందుకు నిందితుల నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. నిందితులు ఈ పరీక్షలకు అంగీకరించకుంటే, మరో మార్గాన్ని విచారణ అధికారులు ఆశ్రయించవచ్చు. ఇదే విషయాన్ని మళ్ళీ కోర్టుకు చెప్పిన చార్మీ తన ఇష్టం లేకుండా రక్త నమూనాలను తీసుకోవటానికి ఒప్పుకునేది లేదంటోంది...

కోర్టు పరిగణనలోకి తీసుకోదు

కోర్టు పరిగణనలోకి తీసుకోదు

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంతా చేసి ఈ తరహాలో లభించిన సాక్ష్యాలు కోర్టులో నేర నిరూపణను చేయలేవు. గతంలో పలు కేసుల్లో వివిధ కోర్టులు ఈ విషయాన్ని తేల్చాయి. ఈ సాంకేతిక విధానాల ద్వారా నిందితుడు స్వయంగా ఇచ్చుకునే సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోదు.

నేర నిరూపణకు పనికి రాని పద్దతుల్లో

నేర నిరూపణకు పనికి రాని పద్దతుల్లో

అందుకే అసలు ఏ విధంగానూ నేర నిరూపణకు పనికి రాని పద్దతుల్లో విచారణ జరపటం ద్వారా తన మీద లేని పోని నిందలు రావటం ఎందుకన్నది చార్మీ వాదన అట. ఇక్కడ ఎవరూ చేయని సాహసం చేసిన చార్మీ దెబ్బకి ఈ కేసులో కీలక అధికారి అకున్ సభర్వాల్ కే నోటీసులందాయ్.

అకున్ సబర్వాల్ కు నోటీసులు జారీ

అకున్ సబర్వాల్ కు నోటీసులు జారీ

చార్మి పిటిషన్ పరిశీలించిన హైకోర్టు.. ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా మంగళవారం విచారణ సందర్భంగా వివరణ ఇవ్వనున్నారు. కాగా, డ్రగ్స్ కేసులో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడతామని చంద్రవదన్, అకున్ సబర్వాల్ చెప్పారు

English summary
Tollywood Actress Charmi Kaur files petition in High Court in Drugs Case, objection in collection of blood samples.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu