»   » మహేష్ కు ధాంక్స్ చెప్పిన దీపిక...కారణం ఇదీ

మహేష్ కు ధాంక్స్ చెప్పిన దీపిక...కారణం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా మహేష్ బాబు ధాంక్స్ చెప్తూ దీపిక పదుకోని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. హఠాత్తుగా దీపిక..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె చేసిన ట్వీట్ చూడండి.

అయితే ఎందుకని దీపిక ధాంక్స్ చెప్పిందీ అంటే ...ఈ మధ్యన మహేష్ బాబు ఆమె తాజా చిత్రం తమాషా చూసారు. దాంతో వెంటనే ఆమెకు ఫోన్ చేసి ఫెరఫార్మెన్స్ మెచ్చుకున్నారు. దాంతో దీపిక ఇలా ట్వీట్ ద్వారా ధాంక్స్ చెప్పింది. ఈ విషయం బయిటకు తెలియని ఫ్యాన్స్ ఎందుకిలా దీపిక చెప్పిందా అని అనుకుంటున్నారు.

అంతేకాదు మహేష్ బాబు... ఈ మధ్యన ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వూలో దీపిక ప్రస్దావన తెచ్చారు. మహేష్ బాబు మాట్లాడుతూ... "నా ఆల్ టైమ్ ఫేవరెట్ నటి శ్రీదేవి, అయితే ఇప్పుడు దీపికపదుకోని. ఆమె చాలా తెలివైన నటి. పీకే లో ఆమె నటన చూసి స్టన్ అయ్యాను. ఆమె అందగత్తే మాత్రమే కాదు, నటిగా కూడా చాలా గొప్పది. ఈ రెండూ ఒకరిలో ఉండటం చాలా మరింత గొప్ప విషయం ," అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. అదీ మహేష్ కు ధాక్స్ చెప్పటానికి దీపికాకు ఉన్న కారణం.

Why Deepika Padukone Thanked Mahesh Babu On Twitter

ఇక దీపిక, మహేష్ బాబు కాంబినేషన్ చాలా కాలంగా చర్చల్లో ఉంది. అయితే వీరిద్దరినీ కలిపే ప్రాజెక్టే ఇప్పటివరకూ సిద్దం కాలేదు. అయితే రీసెంట్ గా దీపిక కూడా తన తాజా చిత్రం బాజీరావు మస్తానీ ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు తనకు ఇష్టమైన నటుడు అంది. ఇదిగో మహేష్ కూడా బదులు తీర్చేసుకున్నారు తనూ ఓ ఇంటర్వూలో ఆమె గురించి చెప్పి. ఇలా ఎంతకాలం ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటున్నారు. వీరి కాంబినేషన్ వస్తే బాగుండును అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వింటున్నావా మహేష్ బాబూ.

English summary
Mahesh reportedly called Deepika Padukone personally for appreciating her stunning performance in her latest release, Tamasha. Overwhelmed by Mahesh's words, Deepika took to twitter to thank Mahesh Babu.
Please Wait while comments are loading...