twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "గరుడ వేగ" నిర్మాత ఎక్కడ ఉన్నాడు? ఆ విభేదాలే కారణమా?

    గరుడ వేగ టీమ్ చేస్తున్న సక్సెస్ మీట్‌లలో ఈ సినిమా నిర్మాత కోటేశ్వరరాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతను ముందు నుంచి కూడా ఈ చిత్ర ప్రమోషన్లలో పెద్దగా కనిపించింది లేదు.

    |

    Recommended Video

    "గరుడ వేగ" నిర్మాత ఎక్కడ ? ఆ విభేదాలే కారణమా?

    గత వారం రోజులుగా టాలీవుడ్ టాప్ టాక్స్ లిస్ట్‌లో మొదట ఉన్నది 'గరుడవేగ' సినిమానే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించింది. ఇప్పటివరకూ వచ్చిన రాజశేఖర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా కూడా అనిపించుకుంది. ఐతే ఈ టాక్‌కు తగ్గట్లుగా ఈ సినిమా వసూళ్లు లేకపోవడం చిత్ర బృందానికి నిరాశ కలిగిస్తున్న విషయం.

     నిరాశలోనే

    నిరాశలోనే

    డబ్బుల పరంగా నిరాశ పరిచినప్పటికీ అయినప్పటికీ ఆ నైరాశ్యాన్ని బయటికి కనిపించనివ్వకుండా ఉత్సాహంగా సక్సెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు రాజశేఖర్ అండ్ టీమ్. ఇప్పటికీ వసూళ్ళ విషయం నిరాశలోనే ఉన్నట్టు సమాచారం. పోయిన వారం రిలీజైన రాజశేఖర్ సినిమా ‘గరుడవేగ'కు మంచి టాక్ వచ్చింది.

     కేవలం రూ.65 లక్షల షేర్

    కేవలం రూ.65 లక్షల షేర్

    రివ్యూలు బాగున్నాయి. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అయినా ఏం లాభం.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలి రోజు ఆ చిత్రానికి కేవలం రూ.65 లక్షల షేర్ వచ్చింది. ఇది షాకింగ్ విషయమే. ఆ తర్వాత కొంచెం వసూళ్లు పుంజుకున్నప్పటికీ ఈ సినిమా మీద పెట్టిన భారీ పెట్టుబడికి తగ్గట్లుగ అయితే వసూళ్లు లేవు.

     కేవలం 300 థియేటర్లు

    కేవలం 300 థియేటర్లు

    దీనికి ముఖ్య కారణం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడమే. ఈ చిత్రాన్ని కేవలం 300 థియేటర్లలోనే రిలీజ్ చేశారు. ఈ సినిమా స్థాయికి ఇది చాలా చిన్న నంబరే. దీనికి ఇచ్చిన థియేటర్లు కూడా అంత గొప్పవేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు మంచి థియేటర్లు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.

    నిర్మాత కోటేశ్వరరాజు

    నిర్మాత కోటేశ్వరరాజు

    రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెంచినా.. అవి సరిపోలేదు. దీంతో టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు రాలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు గరుడ వేగ టీమ్ చేస్తున్న సక్సెస్ మీట్‌లలో ఈ సినిమా నిర్మాత కోటేశ్వరరాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతను ముందు నుంచి కూడా ఈ చిత్ర ప్రమోషన్లలో పెద్దగా కనిపించింది లేదు.

    పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత

    పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత

    ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాత్రం ఒకసారి అలా వేదిక మీదికి వచ్చి రాజశేఖర్ పక్కన కనిపించాడు. ఆ వేడుకలో ఆయన ఎక్కడా లీడ్ తీసుకున్నది లేదు. ఈ సినిమాపై ఏకంగా పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత ఎందుకు లైమ్ లైట్లోకి రావడం లేదన్నది అర్థం కావడం లేదు.

    రాజశేఖర్ ఫ్యామిలీ

    రాజశేఖర్ ఫ్యామిలీ

    ఈ సినిమాను కోటేశ్వరరాజు మధ్యలో వదిలేస్తే.. రాజశేఖర్ ఫ్యామిలీ టేకప్ చేసి పూర్తి చేసిందని.. రిలీజ్ వ్యవహారాలు కూడా వాళ్లే చూసుకున్నారని వార్తలొచ్చాయి. ఫైనాన్స్ వ్యవహారంలో కూడా రాజశేఖర్ తన సొంత ఫ్లాట్ తాకట్టు పెట్టి మరీ డబ్బులు సర్దినట్టుకూడా చెప్పారు.

     విభేదాల వల్లే

    విభేదాల వల్లే

    మరి ఈ విషయమై విభేదాల వల్లే నిర్మాత తెరముందుకు రావడం లేదా. లేక సరైన స్థాయిలో వసూళ్ళు కనిపించకపోవటంతో నిరాశలో పక్కకు తప్పుకున్నారా అన్నది మాత్రం అర్థం కావటం లేదు.

    English summary
    Why Garuda Vega Producer Koteswara Raju skips Success Meets .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X