»   » నన్ను ఫూల్ అని అనుకోవచ్చు: మంచు విష్ణు

నన్ను ఫూల్ అని అనుకోవచ్చు: మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నందుకు నన్ను ఫూల్ అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఓ తండ్రిగా బిడ్డలను దగ్గరుండి చూసుకోవడం ఓ రివార్డ్‌లాంటిది. ఆ ఆనందాన్ని మిస్ కాదల్చుకోలేదు" అంటున్నారు మంచు విష్ణు. ఈ నెల 2న విష్ణు భార్య విరానికా కవలపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన పాపాయిలకు పేర్లు పెట్టిన విషయం విష్ణు ప్రకటనలో తెలియచేస్తూ ఇలా స్పందించారు. అలాగే... "నేను... ఓ పెద్ద దర్శకుడి సినిమా నేను వదులుకోవలసి వచ్చింది. విరానికా డెలివరీ సమయంలో కేవలం మూడే రోజులు నాకు షూటింగ్‌కి బ్రేక్ ఇస్తానన్నారు. అమెరికాలో ఉండటం, వినీని, నా బిడ్డలను దగ్గరుండి చూసుకోవాలకున్న కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను" అన్నారు.

"ఇక నేను సినిమాల్లో యాక్ట్ చేయడానికే పుట్టాను. నా వయసు చాలా చిన్నది కాబట్టి ఆ దర్శకుడితో భవిష్యత్తులో సినిమా చేస్తాను. ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ని ఎందుకు వదులుకున్నాననే విషయాన్ని ఆయన అర్థం చేసుకుని ఉంటారని భావిస్తున్నాను" అని అన్నారు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం విష్ణు...నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కోన వెంకట్ రచన చేస్తున్న ఈ చిత్రం పక్కా కామిడీతో నడిచే మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఆయన పాపలిద్దరి పేర్లు - 'అరియానా', 'వివియానా'.

English summary
"With the blessings of our parents, Vini and I have decided on the names of our Twins. Ariaana Manchu and Viviana Manchu" said Manchu Vishnu.
Please Wait while comments are loading...