»   » పవన్ ఎక్కడున్నాడు? సెలైంట్ గా ఉండటం వెనుక స్టోరీ

పవన్ ఎక్కడున్నాడు? సెలైంట్ గా ఉండటం వెనుక స్టోరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టీ ఎందుకు పవన్ కళ్యాణ్ లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు...ఎక్కడున్నాడు అసలు ఆయన... ఎందుకుని ఆయన క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ మీద మాట్లాడటం లేదనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

'అత్తారింటికి దారేది' చిత్రంతో ఆల్ టైమ్ హిట్ ఇచ్చి రికార్డులు బ్రద్దలుకొట్టిన పవన్ కళ్యాణ్ తర్వాత చాలా కాలం పాటు మళ్లీ మొహానికి రంగేసుకోలేదు. తర్వాత గోపాల గోపాల చిత్రంలో కనిపించినా అదీ పెద్ద పాత్రేం కాదు...సినిమానూ పెద్దగా ఫలితం సాధించలేదు. అయితే ఇప్పుడు మాట్లాడేది ఆ విషయం గురించి కాదు...గబ్బర్ సింగ్ 2 లో ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రారంభించకపోవటం గురించి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పవన్ ...2014 లో టీడిపి కు సపోర్టు ఇచ్చి ఎలక్షన్ బిజీలో పడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఏమీ వినపడటంలేదు..ప్రశ్నించటం లేదేంటి అని అంతా అంటున్నా ఆయన మాట్లాడటం లేదు..తన అభిప్రాయాలు ప్రస్తుత రాజకీయాలపైన, ఎపికు ప్రత్యేక హోదా పైనా చెప్పటం లేదు. అందరూ ఆయన బయిటకు వచ్చి ఎపి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారని భావించారు. అయితే అదేమీ జరగటం లేదు.

అటు సినిమాలు, ఇటు రాజకీయం గానూ ఆయన స్ధబ్దతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ..మోస్ట్ వాంటెడ్ పర్శన్ గా మారినా ఆయన కనపడటం లేదు. అశలు ఏం జరుగుతోంది. పవన్ రాజకీయాలకు దూరమయ్యారా..లేక వేరే ఆలోచనలు ఉన్నాయా...సినిమాలు కంటిన్యూగా చేస్తారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఆయన ప్రెవేట్ లైఫ్ కు సంభందించిన క్లూ ఒకటీ బయిటకు రావటంలేదు.

అయితే కొందరు అనేది ఏమిటంటే.. స్లైడ్ షో లో చదవండి..

ప్రస్తుతం ...

ప్రస్తుతం ...

పవన్ తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 మీదే దృష్టి పెట్టాడని, అందుకోసం తన బాడీని ప్రిపేర్ చేస్తున్నాడని

అంతేకాదు..

అంతేకాదు..

ఆయన జూన్ 25 నుంచి కంటిన్యూగా షూటింగ్ లో పాలుపంచుకుంటాడని, అదీ గుజరాత్ లో షూటింగ్ అంటున్నారు.

అదేంకాదు...

అదేంకాదు...

మరికొందరు అనేది ఏమిటి అంటే..పవన్ ...తన ఫామ్ హౌస్ లో ఉన్నాడని, అందుకే అక్కడ నుంచే ఆయన సన్నిహితులు మామిడికాయలు గట్రా వెళ్తున్నాయని.

త్రివిక్రమ్ తో చర్చలు

త్రివిక్రమ్ తో చర్చలు

ఫామ్ హౌస్ లో పవన్ తన సన్నిహితుడు త్రివిక్రమ్ తో కలిసి కో బలి ...స్రిప్టు వర్క్ రెడీ చేస్తున్నాడని అంటున్నారు.

ఇక జిమ్ లో

ఇక జిమ్ లో

పవన్ కళ్యాణ్ బెంగుళూరు జిమ్ లో ...క్రితం వారం కనిపించారు.

గడ్డం తీసేసాడు

గడ్డం తీసేసాడు

గత కొంత కాలంగా చర్చగా నిలిచిన గడ్డం ని రీసెంట్ గా తీసేసాడని అక్కడిదే ఈ ఫొటో అంటున్నారు.

పవన్ చూసే నిర్ణయం

పవన్ చూసే నిర్ణయం

ఇప్పటివరకూ తీసిన గబ్బర్ సింగ్ రషెష్ పవన్ చూస్తాడని తెలుస్తోంది.

టైటిల్ మార్పు

టైటిల్ మార్పు

ఇక పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రానికి గబ్బర్ సింగ్ 2 అనే టైటిల్ ని పెట్టదలుచుకోలేదు అని , సర్దార్ టైటిల్ ని ఫైనలైజ్ చేసాడని తెలుస్తోంది.

లీగల్ సమస్యలేనా

లీగల్ సమస్యలేనా

గబ్బర్ సింగ్ టైటిల్ కు గతంలో లీగల్ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటివి తెచ్చుకోవటం ఇష్టం లేని పవన్ టైటిల్ మార్చనున్నాడని చెప్పుకుంటున్నారు.

సినిమాలు పూర్తి చేసి...

సినిమాలు పూర్తి చేసి...

వచ్చే ఎన్నికలు లోగా కమిటైన సినిమాలు పూర్తి చేసి జన సేన పార్టినీ పునర్ నిర్మాణం చేసి, బలోపేతం పనిలో ఉంటాడని తెలుస్తోంది.

English summary
Why is Pawan keeping a low profile? Where is he? Why is he not speaking up on the Cash for Vote Scam. On that note, here we have some hints left for you to guess what Pawan Kalyan is doing right now. Check out the slides below.
Please Wait while comments are loading...