»   » జూ.ఎన్టీఆర్ పెళ్లి ఎందుకు వాయిదా పడింది?

జూ.ఎన్టీఆర్ పెళ్లి ఎందుకు వాయిదా పడింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో జూనియర్ ఎన్టీఆర్ వివాహం ఎందుకు వాయిదా పడిందనేది ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న ప్రశ్న. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మిప్రణతితో ఎన్టీఆర్ పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో ఈ ఇద్దరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, అది కాస్తా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 2011లో వారి వివాహం జరుగుతుంది. తాను నటిస్తున్న శక్తి షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో గానీ డిసెంబర్ లో గానీ పెళ్లి చేసుకుంటే శక్తి షూటింగ్ చేయడం సాధ్యం కాదని ఆయన భావిస్తున్నారట. పెళ్లికి ముందు కనీసం 20 రోజులు షూటింగ్ లు చేయడం సాధ్యం కాదు. పెళ్లి తర్వాత వెంటనే షూటింగ్ లు అంటే కూడా జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించడం సాధ్యం కాదు. అందుకే శక్తి షూటింగ్ పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారట. శక్తి సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో పెద్ద బ్రేక్ ను ఆశిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu