»   » చేదుగా ఉన్న నిజాన్ని భరించలేకే...కాజల్

చేదుగా ఉన్న నిజాన్ని భరించలేకే...కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. అయినా ఫర్వాలేదు..నేను నిజాలు మాట్లాడటానికే ప్రయత్నిస్తాను. కానీ తెరపై మాత్రం పచ్చి నిజాలను చూపిస్తే మాత్రం ప్రేక్షకులు తిప్పి కొడతారు అంటూ చెప్పుకొస్తోంది కాజల్. ఈ కారణం చేతే నిజాలు ఉన్నదున్నట్లు చూపించే తమిళంలో వరస ఆఫర్స్ వస్తున్నా తాను పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదని చెపుతోంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ....తమిళ సినిమాల్లో ఎక్కువ శాతం క్లయిమాక్సులు విషాదవంతంగా ఉంటాయి. అవి ఒక్కోసారి వర్కవుట్‌ అవ్వొచ్చు ఒక్కోసారి కాకపోవచ్చు. అందుకే తమిళ చిత్రాలపై దృష్టి సారించడంలేదు. తెలుగుతో పోల్చితే తమిళ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో నటించినప్పుడు బాగున్నా ఫైనల్‌గా సక్సెస్సే లెక్కలోకి వస్తుంది కాబట్టి తెలుగు సినిమాలు చేయడానికే ఇష్టపడతాను అంటోంది కాజల్‌. ఇక ఆమె తెలుగులో 'లక్ష్మీ కళ్యాణం' చేయకముందే భారతీరాజా చిత్రం 'బొమ్మలాట్టమ్‌'(తెలుగు టైటిల్ రాణా) లో చేసింది. అయితే ఆ చిత్రం ఆలస్యంగా విడుదలైంది. అయితే ఇక్కడ చందమామ, మగధీర వంటి చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన బృందావనం లో చేస్తున్న కాజల్ ఇన్నికబుర్లు చెప్తున్నా తమిళంలోనూ మోది విలైయాడు అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం నాన్‌ మహాన్‌ అల్ల అనే చిత్రంలో నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu