»   » అక్కినేని ఫ్యామిలీకి రెండు హిట్లు ఇచ్చాడు: అయినా కళ్యాణ్ కృష్ణకి ఆఫర్లు ఎందుకు లేవు?

అక్కినేని ఫ్యామిలీకి రెండు హిట్లు ఇచ్చాడు: అయినా కళ్యాణ్ కృష్ణకి ఆఫర్లు ఎందుకు లేవు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్క హిట్ ఇస్తే చాలు సదరు డైరెక్టర్ చుట్టూ ఈగల్లా మూగిపోతారు సినీజనాలు. కానీ, రెండు హిట్స్ ఇచ్చినా ఆ డైరెక్టర్‌కు ఆఫర్లు రావడం లేదట. ఈ మధ్య టాలీవుడ్‌లో కుర్ర డైరెక్టర్లకు మంచి గిరాకీనే ఏర్పడింది. రొటీన్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న వారికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. అయితే.. రొటీన్ కాన్సెప్ట్‌నే ఎంచుకున్నా... తనదైన శైలిలో వినోదం పండిస్తూ రెండు హిట్స్‌ను తన కిట్‌లో వేసుకున్న కళ్యాణ్ కృష్ణకు మాత్రం ఆఫర్లు రావడంలేదట.

కళ్యాణ్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వలేదు

కళ్యాణ్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వలేదు

సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చినా అదికాస్తా "నాగార్జున స్టామినా" బ్యాగ్ లోకే వెళ్ళిపోయింది కానీ కళ్యాణ్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వలేదు. రెండవ చిత్రాన్ని కూడా నాగార్జున బ్యానర్లోనే చేసిన కళ్యాణ్‌ 'రారండోయ్‌ వేడుక చూద్దాం'తోను హిట్‌ కొట్టాడు. అయితే కాస్త పాతపద్దతులనే ఫాలో అయ్యాడు అన్న టాక్ వచ్చినా ఆ సినిమా నాగ చైతన్యకి హిట్ అనే చెప్పాలి కానీ అతనికి ఇండస్ట్రీలో క్రేజ్‌ రాలేదు.

పేరుకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణే

పేరుకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణే

ఈ రెండు సినిమాలనీ నాగార్జున తన అనుభవంతో హిట్‌ చేసుకున్నాడనేది ఇండస్ట్రీ నమ్మకం. పేరుకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణే అయినా అతను తీసిన రెండు సినిమాల విషయంలోనూ నాగార్జున ఎంతో కేర్ తీసుకున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. తనకు నచ్చని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయించడంతో పాటు, దగ్గరుండి ఎడిటింగ్ లాంటి విషయాల్లో కూడా నాగ్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యాడట.

పెద్దగా ఆఫర్లు రావడం లేదా

పెద్దగా ఆఫర్లు రావడం లేదా

దాంతో ఈ రెండు సినిమాల విజయాలను సోలోగా కళ్యాణకృష్ణ ఖాతాలో వేయడానికి కొందరు వెనకాడుతున్నారు. అందువల్లే అతనికి బయట నుండీ పెద్దగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది. దీంతో తన సత్తాచాటుకునే సమయం కోసం కళ్యాణ్ కృష్ణ సైతం ఎదురుచూస్తున్నాడట.

నాగ్ బర్త్ డే సందర్భంగా

నాగ్ బర్త్ డే సందర్భంగా

నాగ్ బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. అప్పుడు జనాలు అడిగారు బంగార్రాజు సినిమా ఏమయిందని. నాగ్ కు మొహమాటం లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. అందుకే ఆ క్యారెక్టర్ కు తగిన కథ దొరకాలి.కళ్యాణ్ ఓ లైన్ చెప్పాడు కానీ నాకు నచ్చలేదు అని కుండ బద్దలుకొట్టేసాడు. కళ్యాణ్ మంచి కథ తెస్తే అప్పుడు చూద్దాం అని తేల్చేసాడు. అంటే ఇక బంగార్రాజు కానీ, కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు కానీ, ఇఫ్పట్లో లేనట్లే అన్నమాట.

 ఒక ఫ్లాప్‌ డైరెక్టర్‌లా

ఒక ఫ్లాప్‌ డైరెక్టర్‌లా

మొదటి రెండు సినిమాలు కూడా నాగార్జున కనుసన్నల్లో జరిగే సరికి అతనికి ఇండివిడ్యువల్‌గా ఎంత సామర్ధ్యం వుందనేది నిర్మాతలకి తెలియలేదు. సోగ్గాడే సీక్వెల్‌ చేద్దామన్న నాగార్జున ఇప్పుడా ఊసే ఎత్తకపోయే సరికి కళ్యాణ్‌కృష్ణకి చేతిలో సినిమా లేకుండా పోయింది. రెండు హిట్లు తీసినా కానీ ఒక ఫ్లాప్‌ డైరెక్టర్‌లా తదుపరి అవకాశం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నపూర్ణ సంస్థతో పని లేకుండా ఒక సినిమా తీసి హిట్‌ చేస్తే తప్ప ఇతడిని సీరియస్‌గా తీసుకోరేమో.

English summary
Director Kalyan Krishna has no project on hand. Sources say Nag had some issues with Kalyan Krishna during the shoot of Rarandoi. Nag got some deft editing done to save the film. If those rumours are true, that explains why he is without a project hand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu