»   » వరుణ్ తేజ్ ‘కంచె’ రిలీజ్ వాయిదా ఎందుకు?

వరుణ్ తేజ్ ‘కంచె’ రిలీజ్ వాయిదా ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచె'. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ ఏకంగా నెల రోజులు వాయిదా వేసారు. వాయిదాకు కారణం చెబుతానన్న వరుణ్ తేజ్ ఇప్పటి వరకు ఏ విషయం బయట పెట్టలేదు.

మరో వైపు ‘కంచె' సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ పూర్తయిందటే సినిమా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లే. అయితే అన్నీ సవ్యంగా ఉన్నపుడు సమస్య ఏమిటి? అనేది మాత్రం తెలియడం లేదు.


నవంబర్ 6న ‘కంచె' విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నెల రోజుల ముందుగానే సినిమా సెన్సార్ పూర్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాపై ఎన్నో అంచనాలతో ఉన్న అభిమానుల విడుదల వాయిదా పడటంలో డీలా పడ్డారు. మరి వరుణ్ తేజ్ వీలైనంత త్వరగా వాయిదాకు గల కారణాలు బయట పెడితే అభిమానుల్లో అసంతృప్తి తగ్గుతుంది.


 Why Kanche Release Date Postponed

తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.

English summary
Kanche might not release on October 2, according to the sources. Instead, the makers of the film are reportedly looking for an alternate release date, which can be October 30 or November 6.
Please Wait while comments are loading...