»   »  ఆ జవాబు చెప్పిన మరుక్షణం నన్ను చంపేస్తారు - రాజమౌళి ఎందుకిలా అనాల్సి వచ్చింది?

ఆ జవాబు చెప్పిన మరుక్షణం నన్ను చంపేస్తారు - రాజమౌళి ఎందుకిలా అనాల్సి వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకే ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా సినీ అభిమానులను వేదిస్తోంది. గత సంవత్సర కాలం గా ఆ ప్రశ్న మీదచర్చలేచర్చలు... వందల కొద్దీ జోకులూ. సగటున సంవత్సర కాలం గా ఇండియామొత్తం మీద కనీసం 5-6 సార్లు వినిపించే ప్రశ్న అది...ఇంతకీ ఏంటా ప్రశ్న అంటారా ఆ ప్రశ్నకు సమాధానం విలువ కొన్ని వందల కోట్లు..కొందరి సమిష్టి కల..ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ ఆత్మగౌరం ఇవన్నీ ఆధార పడిఉన్నాయి... ఇప్పటికైనా తట్టిందా.... "కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?"

ఈ సంవత్సర కాలం లో దర్శకుడు రాజమౌళినే డైరెక్ట్ గా ఈ ప్రశ్న కొన్ని వందల మంది అడిగారు కానీ రెండవ భాగానికి కావాల్సిన కీలక మలుపు అందులోనే ఉండటం తో ఆ గుట్టు మాత్రం విప్పలేదు రాజమౌళి.ఎప్పుడూ కట్టప్పని తాను అంతటి అనుమానాస్పదుడిగా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వెళ్ళడించలేదు.


"Why Katappa kills Bahubali"? The Same question repeats

చివరికి గురువారం ఢిల్లీలో "సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు అందుకున్న టైంలో అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖల మధ్య కూడా రాజమౌళికి ఇదేప్రశ్న ఎదురైంది. ప్రముఖ విమర్శకుడైన రాజీవ్ మసంద్ రాజమౌళి అవార్డ్ తీసుకోవటం అవగానే ఇదే ప్రశ్న వేసాడు. ముందుగా అందరి తఫునా ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల్సిందే అంటూ అడిగాడు...(రాజ మౌళి చెప్పడని రాజీవ్ కి తెలుసు కానీ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ ప్రశ్నని మరో సారి గుర్తు చేయాలని భావించాడు)


"కట్టప్పానే బాహుబలికో క్యూ మారా" బస్ ఏ తో బతాయియే అని రాజీవ్ అడ్గగానే "ఈ ప్రశ్నకు నేను ఖచ్చితంగా సమాధానం ఇక్కడ చెప్పలేను. అదిగో అక్కడ నిర్మాతలు నావైపు గన్ ఎక్కుపెట్టిమరీ ఉన్నరు..,జవాబు చెప్పటం పూర్తి అయీఅవకుండానే నా పని అయిపోతుంది..,సమాధానం కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకూ ఆగాల్సిందే" అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు.


"Why Katappa kills Bahubali"? The Same question repeats

అవార్డు తీసుకోగానే పోడియం మీదకి వెళ్ళిన రాజమౌళి మొదట తెలుగులో "నమస్కారం" అంటూ మొదలు పెట్టాడు. తర్వాత.. "నేను ఎప్పుడూ కెమెరాలు, లైట్లే జీవితంగా గడుపుతుంటాను. కానీ వాటి ఎదురుగా నేనుంటే మాత్రం చాలా కంగారుగా ఉంటుంది. ఈ అవార్డు విషయంలో ఓ కంప్లైంట్ ఉంది. ఇది నా ఒక్కడికి కాకుండా బాహుబలి టీం మొత్తానికి దక్కి ఉంటే చాలా సంతోషించేవాడిని. ఎందుకంటే ఇది టీం వర్క్ వల్ల సాధ్యమైన సినిమా. కాబట్టి ఇది మొత్తం నా టీం అంతటికీ దక్కిన అవార్డుగా భావిస్తున్నా" అన్నాడు.

English summary
S.s.Rajamoulis funny answer to Rajeev masad's quistion on "CNNIBN INDIAN OF THE YEAR" Award function thaT "Why Kattappa kills Bahubali?"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu