»   »  మనోజ్ పెళ్లికి నాగార్జున ఎందుకు రాలేదు?

మనోజ్ పెళ్లికి నాగార్జున ఎందుకు రాలేదు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ పెళ్లి వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా దాదాపుగా హాజరయ్యారు. అయితే నాగార్జున-అమల దంపతులు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. పెళ్లి ముందు మంచు వారి ఇంట్లో జరిగిన నలుగు పెట్టే వేడుక, పెళ్లి కొడుకును చేసే వేడుక, సంగీత్ వేడుకల్లోనూ నాగార్జున కనిపించలేదు.

నాగార్జున దంపతులు ఈ వేడుకకు హాజరు కాక పోవడానికి గల కారణం ఏమిటో తెలిసి పోయింది. ప్రస్తుతం వారు అసలు ఇండియాలోనే లేరు. స్పెయిన్ వెళ్లారు. నాగార్జున తనయుడు అఖిల్ నటిస్తున్న మొదటి సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు.

 Why Nagarjuna & Amala Missed Manchu Manoj Wedding?

ముద్దుల కొడుకు నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ జంట చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. హైదరాబాద్ లో జరిగిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ స్వయంగా వీక్షించిన వీరు.....రొమాంటిక్ సాంగుల విషయంలో కొడుకు పెర్ఫార్మెన్స్ స్వయంగా చూడటానికే అక్కడికి వెళ్లారట.

అఖిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘మిస్సైల్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్, అనూప్ రూబెన్స్ జాయింటుగా సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
It is heard that King Nagarjuna and Amala couple left for Spain recently. There is an reason involved in their trip. As we reported earlier, Akhil is busy shooting for his debut movie in Spain at the moment. Apart from doing some romantic songs with the leading lady, he is doing action sequences extensively. To watch the performance of their son in on location, the proud parents left for Spain.
Please Wait while comments are loading...