»   » బాలయ్యను ఆహ్వానించని నాగ్? అప్పటి గొడవలే కారణమా..!? టాలీవుడ్ గుసగుసలు

బాలయ్యను ఆహ్వానించని నాగ్? అప్పటి గొడవలే కారణమా..!? టాలీవుడ్ గుసగుసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అక్కినేని నాగార్జున కుమారుడు, వర్దమాన హీరో అఖిల్ నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన ప్రముఖ వ్యాపార వేత్త జీవీకే మనువరాలు శ్రేయా భూపాల్ రెడ్డితో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ పెళ్లి ఇటలీలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక నాలుగు రోజుల్లో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అఖిల్‌-నాగ్‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ్వ‌రూ హాజ‌రు కావ‌డం లేద‌ట‌.

  ఈ ఎంగేజ్‌మెంట్‌కు టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని అంద‌రూ భావించారు. అయితే ఇప్పుడు వారెవ్వ‌రు హాజ‌రు కావ‌డం లేద‌ని తెలుస్తోంది. చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు మినహా మరెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదట‌. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే టాలీవుడ్ లోనే టాప్ హీరోలయిన బాలకృష్ణ చిరంజీవి ఈ ఇద్దరిలో కేవలం చిరంజీవికి మాత్రమే ఆహ్వానం అందింది... బాలకృష్ణ ని పిలవక పోవటం వెనుక ఎప్పటినుంచో నాగార్జునా బాలయ్యల మధ్య ఉన్న వివాదాలే అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలపై ఒక లుక్..

  చాలా సెలక్టివ్ గా:

  చాలా సెలక్టివ్ గా:

  హీరో అఖిల్ నిశ్చితార్థం డేట్ దగ్గరకు వస్తోంది. నాగార్జున ఈ ఫంక్షన్ హడావుడిలో బిజీగా వున్నారు. పొలిటికల్, బిజినెస్, మూవీ రంగానికి చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్ హాజరవుతారు. ఈ మేరకు చాలా సెలక్టివ్ గా నాగ్ ఆహ్వానాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫొటోలు మీడియాలో హల్ చల్ చేసాయి.

  నాగ్, అఖిల్ ఇద్దరు వెళ్లి కలిసి:

  నాగ్, అఖిల్ ఇద్దరు వెళ్లి కలిసి:

  అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా నాగ్ చాలా సైలెంట్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడుని నాగ్, అఖిల్ ఇద్దరు వెళ్లి కలిసి, ఇన్విటేషన్ అందించినట్లు తెలుస్తోంది. ఇది జరిగి కొద్ది రోజులే అయింది. అదే రోజు రాజుగారి గది 2 ఓపెనింగ్ కూడా అయింది. అయితే మీడియాలో మాత్రం ఎక్కడా ఫొటోలు లేవు, వార్తలు లేవు.

  బాలయ్యకు ఆహ్వానం అందలేదని :

  బాలయ్యకు ఆహ్వానం అందలేదని :

  ఇదిలా వుంటే హీరో బాలకృష్ణతో నాగ్ కు తెలియని విబేధాలున్నాయని గుసగుసలు వున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా, అఖిల్ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు బాలయ్యకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇంతకీ ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి అంటే.. ఖచ్చితంగా తెలీదు గానీ ఒకటీ రెందు సంవత్సరాలుగా మరింత రాజుకున్నాయని చెప్పుకుంటున్నారు..

  అక్కినేని ఫ్యామిలీపై ఆగ్ర‌హం:

  అక్కినేని ఫ్యామిలీపై ఆగ్ర‌హం:

  ఇదివరలో నాగార్జున నాగేశ్వ‌ర్ రావు 75ఏళ్ల సినీ వ‌సంతోత్స‌వ వేడుక జ‌రిపిన‌పుడు బాల‌య్య‌ను ఇన్వైట్ చేయ‌లేద‌ట నాగ్. తీరా ఫంక్ష‌న్ ద‌గ్గ‌ర ప‌డే స‌మ‌యానికి...బాల‌య్య అక్కినేని ఫ్యామిలీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా నాగార్జున పై. నాకు అక్కినేని నాగేశ్వ‌ర్ రావు అంటే ఎంతో గౌర‌వం. ఆయ‌న్ను నేను బాబాయ్ అని ప్రేమ‌గా పిలుస్తాను. నాన్న‌కు స్నేహితుడు.

  నంద‌మూరి ఫ్యామిలీ అధికారంలో లేద‌ని :

  నంద‌మూరి ఫ్యామిలీ అధికారంలో లేద‌ని :

  మా ఇంట్లో ఏ కార్య‌మైనా కూడా ఆయ‌న్ను పిల‌వ‌కుండా, చెప్ప‌కుండా చేయం. కానీ చిరంజీవి, మోహ‌న్ బాబు లాంటి వాళ్ల‌ను కూడా పిలిచి ఇంత వ‌ర‌కు మాకు ఆహ్వానం రాలేదంటే తెలుస్తూనే ఉంద‌ని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆగ్ర‌హంతో పాటు ఆవేద‌న కూడా చెందాడ‌ట. ఇక నంద‌మూరి ఫ్యామిలీ అధికారంలో లేద‌ని చిన్న చూపా లేకుంటే ఇంకేమైనానా అని సన్నిహితులదగ్గర చెప్పాడట. ఆ వార్తలు నాగ్ చెవిలో కూడా పడ్దాయని సమాచారం.

   మొహం మీదే చెప్పాడ‌ట‌:

  మొహం మీదే చెప్పాడ‌ట‌:

  ఈ విష‌యం తెలిసిన నాగ్...స‌రిగ్గా మ‌రో రెండు రోజులు ముందు అక్కినేని వేడుక జ‌ర‌గ‌నుండగా నాగార్జున బాల‌య్య ఇంటికి వెళ్లాడట‌. ఆస‌మ‌యంలోనే ఇంట్లోనే ఉన్న బాల‌య్య‌తో దాదాపు అర‌గంట సేపు మాట్లాడాట‌. కానీ నాకు వీలు ప‌డ‌దు. నాకు ఆరోజు వేరే ప‌నులున్నాయ‌ని మొహం మీదే చెప్పాడ‌ట‌. దీంతో నాగార్జున ఉస్సూర‌మ‌ని ఉత్త చేతుల‌తో వెన‌క్కి వ‌చ్చాడు.

   దెప్పిపొడిచాడు:

  దెప్పిపొడిచాడు:

  ఇక అప్పటినుంచీ ఈ వివాదం పైకి కనిపించకుండా రగులుతూనే ఉంది. నాగార్జున నటవారసుడు అఖిల్ సినిమా "అఖిల్" ధారుణమైన పరాజయం పాలైనప్పుడు కూడా.. మోక్షఙ్ఞ కోసం ఒక మంచి లవ్ స్టోరీ అనుకుంటున్నమనీ, మొదటి సినిమాకే నాకొడుకు ఏదో ప్రపంచాన్ని కాపాడాడూ అనిపించుకునే కాన్సెప్టులు వద్దనీ అంటూ దెప్పిపొడిచాడు బాలయ్య.

  నాగ్ ను మాత్రం పిల‌వ‌లేదు:

  నాగ్ ను మాత్రం పిల‌వ‌లేదు:

  అంతే కాదు చిరంజీవిని కూడా గౌత‌మి పుత్ర శాతక‌ర్ణి వేడుక‌కు పిలిచిన బాలకృష్ణ...నాగ్ ను మాత్రం పిల‌వ‌లేదు. న‌న్ను అవ‌మానించిన వాళ్ల‌ను నేనెందుకు గౌర‌వించాల‌నే కోపంతోనే పిల‌వ‌లేద‌ని టాక్. రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర న‌టుల‌కు ఆహ్వానం ప‌లికిన‌ బాల‌య్య‌...నాగార్జున‌కు గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి వేడుక‌కు కనీసం నాగార్జునకి ఇన్విటేషన్ కాదు కదా ఇంటిమేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ట‌.

  టాలీవుడ్ మొత్తం మీదా:

  టాలీవుడ్ మొత్తం మీదా:

  ఇక అందుకే తన ఇంట్లో జరిగే ఫంక్షన్ కి కూడా బలయ్యని పిలవకుండానే మౌనంగా ఉండిపోయాడు నాగార్జున. టాలీవుడ్ మొత్తం మీదా ఆహ్వానం వెళ్ళింది కేవలం మెగాస్టార్ కి మాత్రమే. అదీ కొన్ని బిజినెస్ వ్యవహారాల్లో ఇద్దరూ పార్ట్నర్లు కాబట్టి అని చెప్పుకుంటున్నారు.

  English summary
  Reports are coming that Akkineni Akhil's engagement will be a close-family event with main members and relatives of both GVK and Akkineni families present. From Tollywood, only Chiranjeevi and Allu Arvind's families have got the invite as they are long-time good friends of Nagarjuna. Other Tollywood actors and friends are not invited, say sources.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more