నందమూరి ఫ్యామిలీ నుండి ఒక్కరూ రాలేదేంటి?
హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. నందమూరి వంశ హీరోలతో సినిమాలు తీసి హిట్లు కొట్టిన బడా నిర్మాత. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ సినిమాలతో పాటు జూ ఎన్టీఆర్‌తో 'ఆది' సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టాడు. తాజాగా జూ ఎన్టీఆర్‌తో'రభస'సినిమా చేస్తున్నారు.
సినిమాల సంగతి పక్కన పెడితే నందమూరి హీరోలైన బాలయ్య, జూ ఎన్టీఆర్ అంటే ఆయనకు మహా అభిమానం అనేది ఇండస్ట్రీ టాక్. తాజాగా బెల్లంకొండ సురేష్ కొడుకు సాయిశ్రీనివాస్ వివి వినాయక్ దక్శకత్వంలో 'అల్లుడు శీను' ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఆడియో వేడుకకు నందమూరి హీరోల్లో ఎవరో ఒకరు వస్తారని సినీ జనాలు ఊహించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అటు బాలయ్యగానీ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ ఈ ఆడియో వేడుకకు హాజరు కాలేదు. మరి వీరు ఎందుకు హాజరు కాలేదు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఆ సంగతి పక్కన పెట్టేసి....అల్లుడు శీను సినిమా విషయానికొస్తే వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ గణేష్ నిర్మిస్తుండగా బెల్లంకొండ సురేష్ సమర్పకులు. తమన్నా ఐటం సాంగు చేస్తోంది. ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, వేణు, రవిబాబు, వెన్నెల కిషోర్, ఫిష్ వెంకట్, ఫణి, జెన్నీ, రవిబాబు తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











