నాగార్జున కన్నా నారాయణమార్తే తెలివిగా ముందడుగు

By Srikanya

విప్లవ సినిమాలకు పెట్టింది పేరైన ఆర్.నారాయణమూర్తి తాజా చిత్రం పోరు తెలంగాణా. ఈ చిత్రం సెప్టెంబర్ 16 న విడుదలై తెలంగాణా ప్రాంతాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.అందులోనూ ప్రస్తుతం సకల జనల సమ్మెతో తెలంగాణ ఉద్యమం మరింత వేడెక్కి ఉండటం ఈ సినిమాకు కలిసి వచ్చిన అంశం. అంతేగాక ఈ సినిమా గురించి కేసీఆర్,మరికొంత మంది టీఆర్ఎస్ లీడర్స్ ప్రీమియర్ షోకు హాజరయ్యి మాట్లాడి ఎగస్ట్రా ప్రమోషన్ ఇచ్చారు.అయితే ఇదే సమయంలో అందరి దృష్టీ రాజన్న మీద ఉంది. నాగార్జున నటించిన రాజన్న చిత్రం విడుదలై ఉంటే దానికి చాలా ఉపయోగపడేది అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున కన్నా నారాయణ మూర్తే తెలివిగా స్టెప్ వేసి తన సినిమాకు మైలేజి తెచ్చుకున్నాడంటున్నారు. ఇక నాగార్జున తన రాజన్న చిత్రానికి రీషూట్ పెట్టుకున్నారు. ఈ చిత్రం కూడా తెలంగాణా పోరాట యోధులకు చెందిన కథే కావటంతో ఈ సమయంలో విడుదయ్యి ఉంటే గ్యారెంటీగా వర్కవుట్ అయ్యేదంటున్నారు.

ఇక ఈ చిత్రంలో నాగార్జున కేవలం క్లైమాక్స్ ముందు ఓ అరగంట మాత్రమే కనపడతారు. కథ మొత్తం ఓ చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. ఆ చిన్న పాపను నాగార్జున వచ్చి రక్షిస్తాడు. అయితే కథ అనుకున్నప్పుడు ఆ పాత్ర మరీ జెచిన్నదిగా ఉందిట. రాజమౌళి వచ్చి...ఆ పాత్ర లెంగ్త్ ఓ ఇరవై నిముషాల వరకూ పెంచారని తెలుస్తోంది.అయితే ఆ విషయం బయిటకు వస్తే సినిమా బిజెనెస్ దెబ్బ తింటుందని దాన్ని దాచి పెడుతున్నారు. నాగార్జుననే ఫోకస్ చేస్తూ బిజెనెస్ చేసే ప్రయత్నాల్లో ఊన్నారు నిర్మాతలు. నాగార్జున సైతం ఈ పాత్ర గురించి బయిట మాట్లాడటం లేదు. ఎంతసేపూ నాగార్జునని, రాజమౌళిని హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే నిర్మిస్తున్నారు. తెలంగాణా చారిత్రిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి షూటింగ్ నిర్వహించారు. స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ తొమ్మిదన ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X