»   » 'బాహుబలి 2' ఫస్ట్ లుక్ లాంచ్ అందుకే రాలేకపోయా: రానా

'బాహుబలి 2' ఫస్ట్ లుక్ లాంచ్ అందుకే రాలేకపోయా: రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి సిరీస్ కి సంబంధించినంత వరకూ ప్రభాస్- దగ్గుబాటి రానా లను రెండు పిల్లర్స్ అనే విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే బాహుబలి2 ఫస్ట్ లుక్ లాంఛ్ సమయంలో రానా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాహుబలి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయమై కామెంట్స్ కూడా చేసారు. కానీ నిజానికి ఈ విషయమై రానా ఇప్పటికే వివరణ ఇచ్చి ఉన్నారు.

కానీ బాహుబలి 2 ఫస్ట్ లుక్ మేనియా, విఆర్ ఎక్సపీరియన్స్ వీడియో వంటి వాడి గొడవలో పడి మీడియాఈ విషయాన్ని హైలెట్ చెయ్యలేదు. కానీ రానా మాత్రం ఫీలయిపోతున్నానని చెప్తున్నారు.

తేజ దర్శకత్వంలో కాజల్ తో రొమాన్స్ చేస్తూ ఓ సినిమాలో నటిస్తున్నాడు రానా. తమిళనాడులో కరైకుడి ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దగ్గుబాటి సురేష్ బాబు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో చెప్పాడు.

'బాహుబలి ఫస్ట్ లుక్ లాంఛ్ కు హాజరు కానందుకు క్షమించమని కోరుతున్నా. తమిళనాడులో ఎయిర్ పోర్టుకు 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఓ చిన్న టౌన్ లో షూటింగ్ ఉన్నాను. షెడ్యూల్ బ్రేక్ చేసే పరిస్థితి లేదు. నా ఆత్మ మాత్రం అక్కడే ఉంది' అంటూ వ్యక్తిగా హాజరు కాకపోయినా.. బాహుబలి పై ప్రేమను మాత్రం ట్వీట్ రూపంలో చెప్పాడు రానా.

 Rana

రానా మాట్లాడుతూ . నేను రాజ‌మౌళిగారిని క‌లిసిన‌ప్పుడు ఒక మ్యాప్ చూపించారు. మ‌హిష్మ‌తి అనే రాజ్యం. ది వాళ్లు క్రియేట్ చేసిన ప్ర‌పంచం. ఒక మ‌హావృక్షాన్ని వాళ్లు క్రియేట్ చేశారు. అందులో ఒక కొమ్మ సినిమా. టెలివిజ‌న్ సీరీస్‌, కామిక్ బుక్స్, మెర్చండైజింగ్‌, వ‌ర్చువ‌ల్ థింగ్స్ వంటి విష‌యాల్లో వాళ్లు కేర్ తీసుకున్నారు. యామ‌జాన్ ప్రైమ్ నుంచి మా టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 1న విడుద‌ల చేసాం. వ‌ర‌ల్డ్ క్లాస్ యానిమేష‌న్ చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది అన్నారు.

బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
SS Rajamouli, Prabhas, Anushka and Tamannah attended the launch event at MAMI, only the Villain of Baahubali 2, Rana skipped the first look launch. He apologizes to the audiences as he was unable to attend the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu