»   » థ్రిల్లింగ్ గా ఉంది...! నిఖిల్ "కేశవ", కుడిపక్క గుండె., పగ కోసం, ప్రాణం తో

థ్రిల్లింగ్ గా ఉంది...! నిఖిల్ "కేశవ", కుడిపక్క గుండె., పగ కోసం, ప్రాణం తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్నాళ్ళ క్రితం వరకూ యువహీరో అంటే ప్రేమకథలకి మాత్రమే సరిపోతాడు అన్నట్టుగా ఉండేది. కొన్ని ప్రయోగాలు చేద్దాం అనుకున్న యువ హీరోలు ధారుణంగా ఫెయిలయ్యేవాళ్ళు కూడా. ప్రయోగం అంటే రొటీంగా కాకుండా కొంచం వేరుగా ఉంటే చాలు అన్న అభిప్రాయం "కార్తికేయ" లాంటి సినిమాలతో మారిపోయింది. అవే రొటీన్ ప్రేమకథలని నమ్ముకున్న వరుణ్ సందేశ్ లాంటి హీరోలు వెనుకబడ్డా అదే సినిమాతో వెలుగులోకి వచ్చిన నిఖిల్ మాత్రం మినిమం హిట్ గ్యారెంటీ అనే భరోసా ఇవ్వగలుగుతున్నాడు.

సూర్యా వర్సెస్ సూర్య లాంటి సినిమా ఇంకో హీరో అయితే చేసేవాడు కాదు. కానీ నిఖిల్ మాత్రం అలా ఆలోచించలేదు. యువత లాంటి సినిమా వచ్చినప్పుడు నికిల్ కూడా ఒక మాస్ హీరో అవ్వాలన్న కోరికతోనే ఉన్నాడు. కానీ తర్వాతే అర్థమయ్యింది మూసపాత్రలతో ఇక్కడ నిలబడలేం అని తన స్థాయిలో ఎంతవరకూ వీలైతే అంత వైవిధ్యభరితమైన పాత్రలనే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చేయబోతున్న సినిమాకూడా మరింత వింత సబ్జెక్టే ఇంతకీ ఇప్పుడీ "కేశవ" మెయిన్ లైన్ వింటే ఎవ్వరికైనా ఆసక్తి కలగక మానదు... ఇంతకీ ఏవరీ కేశవ... ఏంటతని కథ..????


ఎక్కడికీ పోతావు చిన్నవాడా:

ఎక్కడికీ పోతావు చిన్నవాడా:

పెద్ద నోట్ల రద్దు తరువాత రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తొలి సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా 2016 కి ఒక కిక్ ఇచ్చింది.


కేశవ:

కేశవ:

ఎక్కడికీ పోతావు చిన్నవాడా సూపర్ హిట్ కావటంతో నిఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా పై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. తన కెరీర్ ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్ లో నటిస్తున్నాడు.


ఎంతవరకూ వీలైతే అంత :

ఎంతవరకూ వీలైతే అంత :

యువత లాంటి సినిమా వచ్చినప్పుడు ని ఖిల్ కూడా ఒక మాస్ హీరో అవ్వాలన్న కోరికతోనే ఉన్నాడు. కానీ తర్వాతే అర్థమయ్యింది మూసపాత్రలతో ఇక్కడ నిలబడలేం అని తన స్థాయిలో ఎంతవరకూ వీలైతే అంత వైవిధ్యభరితమైన పాత్రలనే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చేయబోతున్న సినిమాకూడా మరింత వింత సబ్జెక్టే ఇంతకీ ఇప్పుడీ "కేశవ" మెయిన్ లైన్ వింటే ఎవ్వరికైనా ఆసక్తి కలగక మానదు..


ఫార్ములా సినిమాలు:

ఫార్ములా సినిమాలు:

మొదట్లో వరుసగా ఫార్ములా సినిమాలు చేసినా ఆ తర్వాత రూట్‌ మార్చి కథల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌. ‘స్వామిరారా', ‘కార్తికేయ', ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన కథలు వినిపించి ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.


వెరైటీగా :

వెరైటీగా :

ఇప్పుడు నిఖిల్‌ తాజాగా చేస్తున్న సినిమా ‘కేశవ'. ఈ సినిమా కథ కూడా చాలా వెరైటీగా ఉంది. కథ ప్రకారం నిఖిల్‌ రాజమండ్రిలోని ఓ కాలేజ్‌ స్టూడెంట్‌. అయితే అతనికో సమస్య ఉంటుంది. అందరికీ ఉన్నట్టు కాకుండా అతనికి గుండె కుడివైపు ఉంటుంది. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు.


కనీసం టెన్షన్‌ పడకుండా:

కనీసం టెన్షన్‌ పడకుండా:

ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. ఏ మాత్రం టెన్సన్‌ పడినా అతని పరిస్థితి అంతే. అలాంటి వ్యక్తి కొంతమంది మీద పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కనీసం టెన్షన్‌ పడకుండా, కోపం తెచ్చుకోకుండా ఎలా పగతీర్చుకున్నాడన్నదే కథ.


వెరైటీ స్టోరీ:

వెరైటీ స్టోరీ:

అందుకే ఈ సినిమాకు ‘పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తేనే బాగుంటుంది' అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. మరోసారి, వెరైటీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిఖిల్‌ మరో విజయాన్ని అందుకునేందుకు రెడీ అయిపోతున్నాడన్నమాట. 'ఎక్కడికిపోతావు చిన్నివాడా' తర్వాత నిఖిల్ చేస్తోన్న చిత్రం 'కేశవ'.


స్వామి రారా:

స్వామి రారా:

సుదీర్ వర్మ దర్శకుడు. ఇప్పటికే వీరి కలయికలో 'స్వామి రారా' వచ్చి హిట్ చిత్రంగా నిలిచింది. 'కేశవ' మరో వైవిధ్యమైన కథతో వస్తోంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ప్రీ లుక్ పోస్టర్ తో ఇదో క్రైం థ్రిల్లర్ అన్న హింట్ ఇచ్చిన నిఖిల్


 పెద్దహీరో:

పెద్దహీరో:

ఫస్ట్ లుక్ తో సినిమా జానర్ ఏంటో కన్ఫామ్ చేసేశాడు. ఇక ఈ సినిమా కూడా పక్కాగా నడపగలిగితే నిఖిల్ ఇంకో హిట్ కొట్టెసినట్టే శర్వానంద్, నానిల్లాగ తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకోవటానికి దగ్గరగా ఉన్న ఈ హీరో టాలీవుడ్ చిన్న నిర్మాతలకి పెద్దహీరోలా అయిపోతున్నాడు.


English summary
In 'Kesava', Nikhil will be seen as a student hailing from Rajahmundry. He suffers from a rare kind of heart disease. Unlike other humans, Heart will be on the right side for the Protagonist. He could height be angry more feel the stress. Any kind of mental tension will have adverse affect him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu