»   » సుబ్బరాజు ఎందుకు తెరకు దూరంగా ఉన్నాడు?: డ్రగ్స్ కేసు ప్రభావం కాదుగానీ....

సుబ్బరాజు ఎందుకు తెరకు దూరంగా ఉన్నాడు?: డ్రగ్స్ కేసు ప్రభావం కాదుగానీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu
సుబ్బరాజు ఎందుకు తెరకు దూరంగా ఉన్నాడు?

తెలుగు తెరపై యంగ్ విలన్ గా మెప్పించిన సుబ్బరాజు కొన్నాళ్ళుగా తెరకి దూరంగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో వార్తల్లో నిలవటం తప్ప, ఏ సినిమా ఫంక్షన్ లో గానీ, సినిమా వార్తల్లో గానీ కనిపించలేదు. దాదాపు 'బాహుబలి 2' సినిమాలో కనిపించాక మళ్ళీ ఇంకో సినిమా చేయనే లేదు. హాస్యాన్ని కూడా తనదైన శైలిలో పండించాడు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో ఎప్పుడూ బిజీగా వుండే సుబ్బరాజు, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే ప్రశ్న ఆయనకి ఒక ఇంటర్వ్యూలో ఎదురయ్యింది. ఇంటర్వ్యూలో ఎదురైంది. ఉద్దేశ పూర్వకంగా తాను అవకాశాలు తగ్గించుకోలేదని, అలాగని తనకి అవకాశాలు రాకుండా లేవని అన్నాడు.

why subbaraju away from silver screen

'బాహుబలి 2' కోసం తాను ఎక్కువ డేట్స్ కేటాయించవలసి వచ్చిందనీ, ఆ పాత్రకి గెటప్ ను కంటిన్యూ చేయవలసి వచ్చిందని చెప్పాడు. అందువలన ఆ సమయంలో వచ్చిన సినిమాలు చేయలేకపోయాననీ, అవే సినిమాలు ఈ మధ్యన విడుదలయ్యాయని అన్నాడు. 'బాహుబలి 2' సినిమా షూటింగు ఉండటం వల్లనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను గానీ, మరే ఇతరకారణాలూ లేవని కారణాలు లేవని చెప్పాడు.

English summary
Actor subbaraju Revealed why he is away from silver screen, the Actor says To Continue the getup of Bahubali 2 he can't adjust the Dates for others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu