twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిసిగా పుట్టడం వల్లే అవార్డు రాలేదు: సుమన్

    By Srikanya
    |

    అమలాపురం: అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్ర లభించటం నా జీవితంలో మరుపురాని సంఘటన. ఆ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. బీసీగా పుట్టినందుకో,ఏమోగానీ నాకు మాత్రం అవార్డు రాలేదు. కానీ భగవంతుడు అంతకు మించి ఆనదం కలిగించాడు. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి రాష్ట్రపతి భవన్ లో అన్నమయ్య చిత్రాన్ని చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.

    ముఫ్పై అయిదేళ్ల తన సినీ ప్రస్థానంలో అన్నమయ్య సినిమా మరువలేని మధురానుభూతిని మిగిల్చిదని సినీనటుడు సుమన్‌ పేర్కొన్నారు. కొత్తపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగులో తరంగిణి, ప్రతిఘటన వంటి ఎన్నో మంచి సినిమాలు అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రతో ప్రేక్షకుల ఆదరణ పొందడం అదృష్టంగా ఆయన పేర్కొన్నారు. ఇక ముందు విభిన్న పాత్రల్లో నటించాలని ఉందన్నారు. ప్రసుత్తం వివిధ భాషల్లో 9 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు.

    రాజమండ్రిలో స్వర్ణాంధ్ర కల్చరల్‌ అసోసియేషన్‌ సేవా సంస్థను స్థాపించి తన వంతు సేవాకార్యక్రమాలు చేస్తున్నానని, సుమారు 130 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలంటే ప్రస్తుతం ఆసక్తి లేదని, అయితే జయలలితను ప్రధానమంత్రి చూడాలని ఉందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి ఆమె చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భేష్‌గా ఉన్నాయన్నారు. దేశంలో కఠినతరమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    గత కొన్నేళ్లుగా బీసీల సంక్షేమానికి సంబంధించి సంఘపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో రాజకీయాల కతీతంగా బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేయాలని భావిస్తున్నానన్నారు. త్వరలో అమలాపురం పరిసర ప్రాంతాల్లో మినీ స్టూడియో నిర్మించి ఇక్కడి వారికి ఉపాధి కల్పిస్తానని సుమన్ ప్రకటించారు.

    English summary
    Actor Suman Says that he is not recieved Award because of he is B.C Caste.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X