twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కొలవెరి’ సాంగు పుట్టు పూర్వోత్తరాలు!

    By Bojja Kumar
    |

    కొలవెరి కొలవెరి కొలవెరి కొలవెరి డి...ఎక్కడ చూసినా ఈ పాటే, ఏ నోటవిన్నా ఇదే ట్యూన్. ఏ టీవీ ఛానల్ చూసిన ఈ పాట గురించే చర్చ...ఏ ఇంటర్నెట్ వెబ్ సైట్ ఓపెన్ చేసినా ఈ పాట గురించి మ్యాటర్. చివరకి ఈ పాట ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ పై కూడా చోటు దక్కించుకుంది. నిన్నటి వరకు ధనుష్ ఒక్క తమిళనాడుకే పరిమితం. ఈవేళ... దేశమంతా అతని పేరు మారుమోగిపోతోంది. అంతకు మించి అతను పాడిన 'వై దిస్ కొలవెరి డి' పాట మరీ మారుమోగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే దేశాన్నిప్పుడు ఊపేస్తోంది. ఎల్లలు కూడా దాటి సీమాంతరం, ఖండాంతరం కూడా వ్యాపించింది. పిల్లల్ని, పెద్దల్ని ఆ పాట పట్టి లాగేస్తోంది. ఎక్కడెక్కడో విహరింపజేస్తోంది... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది. అయస్కాంతంలా మన చెవుల్ని అటు వైపు ఆకర్షిస్తోంది!

    నవంబర్ 16 న 'యూ ట్యూబ్' లో అధికారికంగా ఈ పాటను అప్ లోడ్ చేసిన దగ్గర నుంచీ, ఇప్పటి వరకు సుమారు రెండు కోట్ల క్లిక్స్ వచ్చాయి. ఒక ప్రాంతీయ భాషకు చెందిన ఓ పాట ఇలా ఇంతటి ప్రాచుర్యం పొందడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మామూలు జనమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ పాటలోని మాయకు పడిపోతున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్... ఒక్కరేమిటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పాటకు ఫ్యాన్స్ అయిపోయారు. 'ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్స్ సాంగ్స్ లో ఇదొకటి' అంటూ అభిషేక్ ఇప్పటికే కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ నాలుగేళ్ల కొడుకు నేవాన్ నిగమ్ కూడా ఈ పాటకు ఫ్లాట్ అయిపోయాడు. తను ఏకంగా ఈ పాటను పాడి మరింత ప్రమోట్ చేస్తున్నాడు!

    ఇక కుర్రాళ్ళయితే చెప్పేక్కర్లేదు. 'కొలవెరి' పాట మత్తులో తూగుతున్నారు. చెన్నయ్, బెంగళూరు, విజయవాడ, ముంబయ్ లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ పాటకు బ్రహ్మరధం పడుతూ, దీనిని ఎంతగానో ప్రమోట్ చేస్తున్నారు. అయితే, ఇంతకీ ఈ పాటలో ఏముంది? అంటే ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఒక్కటి మాత్రం చెబుతున్నారంతా. ఆ పాటలో సాహిత్యం లేకపోవచ్చు... కానీ, ఏదో మేజిక్ వుంది. ధనుష్ మధురమైన గాయకుడు కాకపోవచ్చు... కానీ, ఆ గొంతులో 'ఏదో' వుంది... అదే అందర్నీ కట్టిపారేస్తోంది!

    అసలీ పాట పుట్టడమే గమ్మత్తుగా పుట్టింది. ఓ భగ్నప్రేమికుడు మందుకొడుతూ ఆ బాధను పాట రూపంలో వ్యక్తం చేయాలన్నది సందర్భం. దర్శకురాలు ఐశ్వర్య ఈ సందర్భాన్ని చెప్పి పాటను వెరైటీగా చేయమంది. సంగీత దర్శకుడు ఆనిరుద్ రవిచంద్ర ట్యూన్ కట్టి ఇచ్చాడు. ధనుష్ అసలు ప్లానింగ్ అంటూ ఏమీ లేకుండా ఓ ఇరవై నిమిషాల్లో ఈ పాట రాసేశాడు. పదాలన్నీ TANGLISH లో వుంటాయి. అంటే తమిళం, ఇంగ్లిష్ మిక్సింగ్ అన్న మాట! తమిళులు తమ నిత్యజీవితంలో ఉపయోగించే ఇంగ్లిష్ పదాలే వాడాడు. పైగా తమిళ యాసలో ఆ ఇంగ్లిష్ ఉచ్చరిస్తాడు. అదే ఇక్కడ వెరైటీ అయింది! సాహిత్యపు విలువలేమీ లేకుండానే ఈ పాట ఇంతిలా హిట్ అవడం ఒక వింతే. అందుకేనేమో బాలీవుడ్ కవి జావేద్ అక్తర్ ఏముందిందులో? అంటూ పెదవి విరిచాడు. నిజమే... సాహిత్య గుబాళింపు లేదు. కానీ హిట్ అయింది... అదే వైచిత్రి!

    English summary
    If you haven’t heard “Kolaveri Di”, you are supposed to be out of sync with the world. The Tamil song with nonsensical lyrics that came out just eight days ago has already notched up up 18,627,696(6:16 PM 12/8/2011) hits on YouTube and its fan following includes the young and the old, the commoner and the celebrity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X