»   » వరణ్ సందేశ్ కి ఓకే అయిన సినిమాకు మంచు మనోజ్ అలా దెబ్బకొట్టాడు

వరణ్ సందేశ్ కి ఓకే అయిన సినిమాకు మంచు మనోజ్ అలా దెబ్బకొట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో మంచు మనోజ్‌, వరుణ్‌ సందేశ్‌ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రాన్ని రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్దం కాలేదు. అయితే దానికి కారణం మంచు మనోజ్ రీసెంట్ గా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే..జి.కె. ఫిలింస్‌ పతాకంపై వరుణ్‌ సందేశ్‌ హీరోగా చేసే చిత్రంలో విలన్‌గా కమిట్‌ అయ్యాను. నేను అమెరికా వెళ్ళి వచ్చేసరికి దర్శకుడు నన్ను హీరోగా మార్చేశాడు. నేను చేయనని..ఇచ్చిన అడ్వాన్స్‌ను వాపసు ఇచ్చేశాను అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

పందెం కోడి హీరో విశాల్ సొంత బ్యానర్ జి.కె.ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేసింది. విశాల్ తో కిలాడి చిత్రం రూపొందించిన తిరు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానకి రెడీ అయ్యాడు. విశాల్ సోదరుడు నిర్మాత విక్రమ్‌ కృష్ణ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ 'దర్శకుడు తిరు ఓ మంచి ప్రేమకథను మాకు వినిపించారు. ఆ కథ మాకు బాగా నచ్చింది. ఇద్దరు యువకులు, ఓ యువతి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఇందులో హీరోలుగా మంచు మనోజ్, వరుణ్‌ సందేశ్ నటిస్తారు అన్నారు. ఇప్పుడది ఈ కారణంతో ఆగిపోయిందన్నమాట. అలా వరుణ్ సందేశ్ కి వచ్చిన ఆఫర్ ని కూడా మంచు మనోజ్ చెడగొట్టినట్లయింది.

English summary
Manchu Manoj and Varun Sandesh are all set to act together and incidentally this is another multistarrer film for Manoj.The film will be produced by Vikram Krishna Reddy, the brother of hero Vishal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu