»   » బిగ్ బాస్: శివబాలాజీ ఏడ్చేశాడు, స్పందించిన ఆయన భార్య

బిగ్ బాస్: శివబాలాజీ ఏడ్చేశాడు, స్పందించిన ఆయన భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్' రియాలిటీ షోలో నటుడు శివ బాలాజీ తీరుపై ఆయన భార్య మధుమిత స్పందించారు.

బిగ్ బాస్ రియాల్టీ షోలో శివబాలాజీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షో చూసిన శివ బాలాజీ భార్య మధుమిత తన భర్త గురించి అతడి ఫేస్‌బుక్ పేజీలో స్పందించారు. ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

బిగ్‌బాస్ షోలో తన భర్త కన్నీరు పెట్టడం చూసి తట్టుకోలేకపోయానని, ఇంతకు ముందెప్పుడూ ఆయనను అలా చూడలేదని మధుమిత అన్నారు.

చాలా ధైర్యవంతుడు...

చాలా ధైర్యవంతుడు...

తన భర్త చాలా ధైర్యవంతుడని, అలాంటి వ్యక్తి కన్నీరు పెట్టడం తాను చూడలేకపోయానని శివబాలాజీ భార్య మధుమిత చెప్పారు. ఒక్కరోజులోనే తన భర్తలోని అసాధారణ కోణాన్ని ‘బిగ్‌బాస్' బయటపెట్టిందని ఆమె అన్నారు.

Bigg Boss Telugu : List Of Celebrities Participating In NTR's Bigg Boss Show
ఇద్దరు పిల్లలు...

ఇద్దరు పిల్లలు...

నటుడు శివబాలాజీ, మధుమితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. బిగ్ బాస్ షోలో ఓ సందర్భంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని మధుమిత సోషల్‌మీడియాలో ద్వారా గుర్తు చేసుకున్నారు.

హృదయాన్ని కలచివేసింది..

హృదయాన్ని కలచివేసింది..

ఓ టాస్క్‌లో భాగంగా సహ పోటీదారాలు చెప్పిన వారి నిజ జీవిత సంఘటనలను విన్న శివబాలాజీ కన్నీరు పెట్టుకోవడం హృదయాన్ని కలచివేసిందని మధుమిత అన్నారు. ఇది తన భర్తలోని అరుదైన కోణమని, దాన్ని ‘బిగ్‌బాస్‌' షో ఒక్కరోజులో బయటపెట్టిందని చెప్పారు.

ఆయన కథ కోసం..

ఆయన కథ కోసం..

ఈ రోజు శివబాలాజీ పంచుకోబోతోన్న ఆయన కథ కోసం ఎదురుచూస్తున్నట్లు మధుమిత. ఆయన కన్నీరు పెట్టుకోవడం చూడలేనని మధుమిత తన భర్త శివబాలాజీ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆయన ఏం చెబుతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో చోటు చేసుకుంది.

వారు ఇలా...

వారు ఇలా...

బిగ్‌బాస్ రియాలిటీ షోలో మొదటి టాస్క్‌లో భాగంగా సెలబ్రిటీలు తమ తమ నిజజీవితాల్లో జరిగిన బాధాకరమైన ఘటనల గురించి చెప్పారు. జ్యోతి, సింగర్ మధుప్రియ లాంటి వాళ్లు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ల జీవితాల్లోని సంఘటనలు విన్న మిగతా సభ్యులు కూడా కంటతడి పెట్టారు.

English summary
Madhumita reacted on his husband Shiva Balaji's state in Telugu Bigg boss reality show, hosted by Jr NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu