»   » మైలురాయిగా నిలిచే పాత్రలో మంచు లక్ష్మీ.. 20న ‘వైఫ్ ఆఫ్ రామ్’ రిలీజ్

మైలురాయిగా నిలిచే పాత్రలో మంచు లక్ష్మీ.. 20న ‘వైఫ్ ఆఫ్ రామ్’ రిలీజ్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వైఫ్ ఆఫ్ రామ్'.విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

  రీసెంట్ గా ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ లో అఫీషియల్ ఎంట్రీ సాధించిందీ సినిమా. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ 'సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్'గా పేర్కొనడం విశేషం. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. ఈ క్రమంలో వచ్చే ఒక్కో సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందంటున్నాడు దర్శకుడు విజయ్.

  ఇక ట్రైలర్ తో విపరీతమైన అటెన్షన్ తెచ్చుకున్న "వైఫ్ ఆఫ్ రామ్" సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి మూవీ టీం ను ప్రశంసించారు.

  Wife of Ram movie releasing on July 20

  మంచు లక్ష్మి కెరీర్ లో ఇది ఓ మైలురాయి లాంటి పాత్ర అవుతుందని ఇప్పటికే సినిమా చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ నెల 20న విడుదల కాబోతోంది 'వైఫ్ ఆఫ్ రామ్'.

  మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.

  Wife of Ram movie releasing on July 20
  RX 100 Movie Heroine Payal Interview

  సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ నాయుడు, మాటలు: సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

  English summary
  Lakshmi Manchu’s upcoming film directed by Vijay Yelakanti is a psychological thriller that has been picturised with some interesting plot points. The recently released trailer received wide applause from many, including director ace S.S. Rajamouli himself. In fact, the film managed an official entry into the Ottawa Film Festival, where it has been termed a socially conscious thriller. The story revolves around a girl called Deeksha who works with an NGO and the tough fight she faces in the process of uncovering her husband’s suspicious death. The film has completed the censor formalities and was awarded a UA certificate by the board that was all praise for the film. It is now set to release on July 20.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more