»   » 50 కోట్ల కొత్త బంగ్లాలోకి ఐశ్వర్యారాయ్ షిఫ్ట్ (ఫోటోలు)

50 కోట్ల కొత్త బంగ్లాలోకి ఐశ్వర్యారాయ్ షిఫ్ట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ..రీసెంట్ గా యాభై కోట్లు పెట్టి ఓ కొత్త భవంతిని కొనుగోలు చేసారు. అది ప్రస్తుతం అమితాబ్ ఫ్యామిలీ ఉంటున్న జల్సా కు ప్రక్కనే ఆనుకుని ఉంది. ఈ బంగ్లాతో కలిపి అమితాబ్ కు ఐదు భవంతలు అయ్యాయి.

ఓ బాలీవుడ్ లీడింగ్ డైలీ ఇచ్చిన సమాచారం ప్రకారం..బచ్చన్ లు ఈ ఇంటి కొనుగోలు కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ కుటుంబంలోకి ఆరాధ్య రావటంతో అమితాబ్ తమ స్ధిరాస్తులను పెంచే ఉద్దేశ్యంలో ఉన్నారు.

ప్రస్తుతం అభిషేక్,ఐశ్వర్య కూడా జాయింట్ ఫ్యామిలీలో కలసి వారి ప్రస్తుత రెసిడెన్సీ జల్సాలో ఉంటున్నారు. అయితే ఆరాధ్య పుట్టిన తర్వాత ఎవరికి వారు వేరే కుటుంబాలు పెట్టుకుని విడిపోతారా అనే రూమర్స్ బయిలు దేరాయి. ఈ కొత్త ఇంటి కొనుగోలుతో వాటికి ఊతం ఇచ్చినట్లయింది.

ఇక ఈ కొత్త బంగ్లా..అమితాబ్,అభిషేక్ పేరట రిజిస్టర్ చేయించారు. ఈ బంగ్లా ఖచ్చితంగా జల్సాకు వెనక ఉంది. విడిపోవటం కన్నా..కలిసి ఉందాముకున్నప్పుడు తమ మధ్య ఉన్న గోడ పడకొడితే ఈ బంగ్లాలు కలిసి ..పెద్దదవుతుందని ఆ డైలీ రాసుకొచ్చింది.

ఇక అమితాబ్ ప్రాపెర్టీ ఫోటోలు స్లైడ్ షో లో..

అమితాబ్ ప్రస్తుతం ఉంటున్న జల్సా రెసిడెన్సీలో ..కూర్చుని పేపరు చదువుకుంటున్నారు. ఈ బంగ్లా అంటే అమితాబ్ కు ప్రాణం. స్వర్గం గా దీన్ని ఆయన అభివర్ణిస్తారు.

ఆరాధ్య బచ్చన్ ..తన తల్లితో కలసి ఆ కొత్త బంగ్లా వద్ద ఇలా ఫోజ్ ఇచ్చారు.

ఇప్పుడుంటున్న జల్సా భవంతి వద్ద.. కొడుకు,కోడలితో కలిసి అమితాబ్ అభిమానులకు అభివాదం చేస్తూ...

ఇప్పుడు అందరి దృష్టీ ఐశ్వర్యా,అభిషేక్ ..ఆ కొత్త బంగ్లాలోకి ఉమ్మడి కుటుంబాన్ని వదులుకుని వెళ్తారా అనే...

ఈ బంగ్లా పేరు ప్రతీక్ష... ఇది బచ్చన్స్ మరో బంగ్లా..ఇక్కడే ఐశ్వర్య,అభిషేక్ ల వెడ్డింగ్ సెర్మనీ చోటు చేసుకుంది.

English summary
Bollywood megastar Amitabh Bachchan has reportedly bought a new bungalow worth Rs 50 crore, which is located just behind the family's primary residence, Jalsa. As per the reports, this is the fifth bungalow, the Bachchans have bought, after Jalsa, Prateeksha, Vatsa and Janak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu