twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో బాహుబలికి గడ్డు పరిస్థితి.. రిలీజ్‌కు నానా కష్టాలు?

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల జైత్రయాత్ర చేసిన బాహుబలి2 చిత్రానికి చైనాలో అనేక అవాంతరాలు అడ్డుపడుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన బాహుబలి2 చిత్ర రిలీజ్ వాయిదాల మీద వాయిదా పడటం సినీ విమర్శకులకు ఆశ్చర్యపడుతున్నది. బాలీవుడ్ బాక్సాఫీస్‌నే కాదు.. భారతీయ సినిమా రికార్డులను కుదిపేస్తూ 1000 కోట్ల క్లబ్ చేరిన దక్షిణాది చిత్రంగా బాహుబలి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత బాహుబలి చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయాలని నిర్మాతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.

    దంగల్‌కు బయపడి..

    దంగల్‌కు బయపడి..

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి చిత్రం ఓ పక్క కుమ్మేస్తుంటే చైనాలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ప్రభంజనం సృష్టించింది. చైనాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ అయిన దంగల్ చిత్రం బాహుబలి రికార్డులను తిరగరాసింది. సుమారు రూ.2000 కోట్ల క్లబ్‌కు చేరువైంది. దంగల్ ప్రభంజనాన్ని తట్టుకుంటుందా అనే సందేహంతో అప్పట్లో బాహుబలిని వాయిదా వేశారు.

    అమీర్‌కు ఫుల్ రెస్పాన్స్

    అమీర్‌కు ఫుల్ రెస్పాన్స్

    దంగల్ చిత్రానికి చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాహుబలికి రిలీజ్‌కు కలిసి రాలేదు. దాంతో వాయిదాల మీద వాయిదాలు పడింది. ఓ దశలో ప్రభాస్, రానా, అనుష్క ఇతర నటీనటులను చైనాలో ప్రమోషన్‌ కోసం వినియోగించుకోవాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయినా దంగల్ బెదురుతో నిర్మాతలు వెనక్కి తగ్గారు.

    డిసెంబర్‌లో రిలీజ్‌కు

    డిసెంబర్‌లో రిలీజ్‌కు

    బాహుబలిని సెప్టెంబర్‌లోనే రిలీజ్ చేయడాలనుకున్నప్పటికీ.. చివరకు డిసెంబర్ రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే డిసెంబర్‌లో భారీ హాలీవుడ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చైనాలో హాలీవుడ్ చిత్రాలకు బహు ప్రజాదరణ ఉన్న సంగతి తెలిసిందే.

    హాలీవుడ్ చిత్రాల బెడద..

    హాలీవుడ్ చిత్రాల బెడద..

    డిసెంబర్ నెలలో చైనాలో భారీ చిత్రాలతోపాటు హాలీవుడ్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. స్టార్ వార్స్, జుమాంజీ, ది బిగ్గెస్ట్ షో మ్యాన్ చిత్రాలు రిలీజ్‌కు ముస్తాబవుతున్నాయి. ఈ చిత్రాలను బాహుబలి2 తట్టుకోగలగుతుందా అనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

    స్టార్ వార్స్ రెడీ

    స్టార్ వార్స్ రెడీ

    స్టార్ వార్స్ సీక్వెల్ ట్రియాలోజిలో ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి రియాన్ జాన్సన్ దర్శకుడు. ఈ సినిమాలో క్యారీ ఫిషర్, మార్క్ హామిల్, ఆడమ్ డ్రైవర్, డైసీ రిడ్లీ తదితరులు నటిస్తున్నారు. క్యారీ ఫిషర్ నటించిన చివరి చిత్రం ఘన విజాయన్ని సాధించించింది. ఈ చిత్రం డిసెంబర్ 15న రిలీజ్ కానున్నది.

    జుమాంజీ వెల్‌కం

    జుమాంజీ వెల్‌కం

    జుమాంజీ: వెల్‌కం టు ది జంగిల్ చిత్రానికి దర్శకుడు జేక్ కాస్డన్. రాబిన్ విలియమ్స్, ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

    బాహుబలి1కు నిరాశే..

    బాహుబలి1కు నిరాశే..

    ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన బాహుబలి1 చిత్రాన్ని చైనాలో కూడా రిలీజ్ చేశారు. కానీ చైనా ప్రేక్షకులు బాహుబలి ఆదరించకపోవడం గమనార్హం. ఈ చిత్రానికి ఊహించిన స్పందన, కలెక్షన్లు రాకపోవడంపై సినీ విశ్లేషకులు, ట్రేడ్ అనలిస్టులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

    బాహుబలి2కు ప్రతికూలత..

    బాహుబలి2కు ప్రతికూలత..

    ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలు బాహుబలికి ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొని బాహుబలి విజయం సాధిస్తుందా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే. విడుదలైన అన్ని ప్రదేశాల్లో ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ లభించింది. ఇక చైనాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే అంశం ఆసక్తిగా మారింది.

    English summary
    Prabhas‘ Baahubali: The Conclusion is officially one of the biggest movies of 2017 beating even Bollywood films this year. The only film that managed to race ahead of Baahubali 2 was Aamir Khan’s Dangal owing to its phenomenal response in China. As per earlier reports the film was to release in September but as per latest update the movie will release only in December. what does Baahubali 2’s release in China in December mean for the film? Does it pose as an advantage or will the magnum Opus have to battle it out with other Hollywood films?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X