Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కృష్ణవంశీ గాలానికి బాలయ్య చిక్కుతాడా...!?
చిరంజీవితో చెయ్యాలనుకున్న 'వందేమాతరం", మహేష్ కోసం రెడీ చేసిన 'ఆకాశం నీ హద్దురా", రవితేజ తో చేస్తానని ప్రకటించిన 'కందిరీగా" రామ్ తో రూపొందిచాలనుకున్న ప్రాజెక్ట్స్...ఇలా పలు ప్రణాలికలూ, ప్రయత్నాల తర్వాత ఇప్పుడు నాగార్జున పంచన చేరారు కృష్ణవంశీ. మహాత్మా తర్వాత ఎవరితో ఎలాంటి సినిమా చేయాలనే అయోమయంతో కృష్ణ వంశీ గత కొంతకాలం నుంచి సినిమాలు లేక ఖాళీగా వున్నాడు. ఇటివలే అక్కినేని మూడు తరాలను కలిపి వంశీ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఆ చిత్రానికి సంబందించిన కదా చర్చలు కుడా నడుస్తున్నాయి. భారీ మల్టీస్టారర్ చేసే కాన్సెప్ట్ తో నాగ్ ని అప్రోచ్ అయిన కృష్ణ వంశీ ప్రస్తుతం ఆ స్ర్కిప్ట్ ని పక్కాగా సిద్దం చేసే పనిలో వున్నారట. కాకపొతే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే సరికి కొంచెం సమయంపడుతుంది. ఇక ఈ లోపు ఓ సినిమా చేయాలని తన సొంత సంస్ధ ఆంధ్రా టాకీస్ పతాకం పై 'బాలరాజు" అనే టైటిల్ ని రిజిస్టర్ చేసాడు వంశీ.
ఇక అ 'బాలరాజు' ఎవరనేది సస్పెన్స్ గా వుంది. కాకపోతే 'బాలరాజు"గా బాలకృష్ణ చేస్తాడని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నారు. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్య కు సింహాలు, పులులు, రెడ్డి లు తప్పు ఏ బాలరాజులు సరపోవని చెప్ప్తున్నారట. మరైతే కృష్ణవంశీ గాలమేస్తోన్న ఆ 'బాలరాజు" ఎవరనే సస్పెన్స్ కి మరికొద్ది రోజుల్లో తెర పడబోతోంది. అంతవరకూ వేచి చూడాల్సిందే.