»   » ఆవిడే.. నాక్కాబోయే ఆవిడ!....ఫస్ట్ టైం నోరు విప్పిన నాగ చైతన్య

ఆవిడే.. నాక్కాబోయే ఆవిడ!....ఫస్ట్ టైం నోరు విప్పిన నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సమంత త్వరలో పెళ్లాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మీడియాలో జరిగిన హడావుడి, కొన్ని సందర్భాల్లో నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించడం తప్పితే.... ఇప్పటి వరకు నాగ చైతన్య తనకు కాబోయే భార్య సమంత అని స్పష్టం చేయలేదు.

ఎట్టకేలకు నాగ చైతన్య ఈ విషయంలో నోరు విప్పారు. సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన నాగ చైతన్య మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్పందించక తప్పలేదు.

మీరు సమంతను పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది... నిజమేనా? ప్రశ్నకు చైతూ స్పందిస్తూ... నిజమే, సమంతతోనే తన పెళ్లి అని స్పష్టం చేశాడు. తన పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుందని చెప్పాడు. ముహుర్తాలు కుదరగానే తన తండ్రి పెళ్లి తేదీని ప్రకటిస్తారన్నారు.

ఇదే విషయమై కొందరు మీడియా ప్రతినిధులు ఇతర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసారు. ఇద్దరు కలిసి కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారటగా... అని అడగ్గా ఇంతకు మించి తననేమీ అడగొద్దంటూ రిక్వెస్ట్ చేసాడు నాగ చైతన్య. చైతూ సినిమాల విషయానికొస్తే....హసమే శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

నాగార్జున ఏమన్నారంటే

నాగార్జున ఏమన్నారంటే

ఇటీవలే నాగార్జున ఓ ప్రెస్‌మీట్‌లో నాగ చైతన్య పెళ్లి గురించి మాట్లాడుతూ తొందర్లోనే జరుగుతుందన్నారు. మంచి సమయం కోసం వేచిచూస్తున్నామన్నారు. చైతూకు కాబోయే భార్య సమంతేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మీరే చెప్పారుగా అంటూ సమాధానమిచ్చి నాగార్జున తన కోడలు సమంతేనని చెప్పకనే చెప్పేశారు.

అఖిల్ పెళ్లి కూడా

అఖిల్ పెళ్లి కూడా

మరో వైపు అఖిల్ వివాహం కూడా జరుగబోతోందని చెప్పిన నాగార్జున... నిశ్చితార్థం డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నాగార్జున స్వయంగా వెల్లడించారు. శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని అఖిల్ ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.

చైతు పెళ్లి తర్వాతే...

చైతు పెళ్లి తర్వాతే...

నాగ చైతన్య కంటే ముందు అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినా... పెళ్లి మాత్రం నాగ చైతన్య తర్వాతే జరిగనుంది. రెండు పెళ్లిళ్లు వేర్వేరుగానే ఉంటాయని నాగార్జున స్పష్టం చేసారు.

అమల, సమంత

అమల, సమంత

ఈ మధ్య క కాలంలో అమల, సమంత మధ్య కూడా మంచి సాన్నిహిత్యం పెరిగింది. కాబోయే కోడలికి తమ కుటుంబ వ్యవహారాలు అన్ని ముందుగానే వివరిస్తోంది అమల.

నాగార్జున హ్యాపీ

నాగార్జున హ్యాపీ

సమంతను తన కోడలిగా చేసుకోవడంపై నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వివాహం సందర్భంగా తన కోబోయే కోడలు సమంత అంటూ తన స్నేహితులందరికీ పరిచయం చేసారు.

English summary
Actor Naga Chaitanya, son of Telugu superstar Akkineni Nagarjuna, has confirmed that he will tie the knot next year. “It (marriage) should happen next year. My father will announce the date once it’s finalised. At the moment, I can’t divulge more information,” Chaitanya told IANS. Rumoured to be in a relationship with actress Samantha Ruth Prabhu, he refused to comment when asked about it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu