»   » ఒక్క హిట్టు ఇవ్వు బాసూ.. కృష్ణవంశీలో క్రియేటివ్ డైరెక్టర్ ఇక కనిపిస్తాడా?

ఒక్క హిట్టు ఇవ్వు బాసూ.. కృష్ణవంశీలో క్రియేటివ్ డైరెక్టర్ ఇక కనిపిస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన కెరీర్‌లో ఎన్నడూ లేని గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందుతున్నాయి. ఆయన ఎంచుకున్న కథలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఒకప్పడు గులాబీ, అంతఃపురం, మురారీ, నిన్నే పెళ్లాడుతా లాంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను దడదడలాడించాడు కృష్ణవంశీ. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌లో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. కానీ వరుసగా చిత్రాలు ఫ్లాప్ కావడంతో కృష్ణవంశీలో క్రియేటివి కనిపించడం లేదనే ఆందోళన సినీ అభిమానుల్లో వ్యక్తమవుతున్నది.

తెలుగు పరిశ్రమకు సింధూరం..

తెలుగు పరిశ్రమకు సింధూరం..

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శివతో పాటు అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తూ.. గులాబీ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఆయన రూపొందించిన నిన్నే పెళ్లాడుతా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సింధూరం విమర్శకులను మెప్పింది.

ఆ చిత్రాలే జోరుకు కళ్లెం..

ఆ చిత్రాలే జోరుకు కళ్లెం..

అంతఃపురం, సముద్రం, ఖడ్గం లాంటి వైవిధ్యమైన చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టాయి. సరైన హిట్టు లేక సతమతమవుతున్న ప్రిన్స్ మహేశ్‌కు మురారీ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇలా దూసుకుపోతున్న సమయంలో చక్రం, డేంజర్ చిత్రాలు కృష్ణవంశీ జోరుకు కళ్లెం వేశాయి.

 సక్సెస్, ఫ్లాప్‌ల మధ్య ఊగిసలాట..

సక్సెస్, ఫ్లాప్‌ల మధ్య ఊగిసలాట..

సినిమాలు ఆడకపోవడం, జోరు తగ్గడంతో కసిగా ఎన్టీఆర్‌తో రాఖీ, కుర్ర హీరోలతో చందమామతో హిట్లు కొట్టాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ అంతగా ఊపందుకొన్న దాఖలాలు కనిపించలేదు. రాంచరణ్‌తో రూపొందించిన గోవిందుడు అందరివాడేలే చిత్రంతో గాడిన పడుతాడు అనుకొన్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

క్రియేటివిటీలో లోపం ఎక్కడ

క్రియేటివిటీలో లోపం ఎక్కడ

పోలీసు, డ్రగ్స్, మాఫియా అంశాలను కథాంశంగా చేసుకొని నక్షత్రంతో ముందుకొచ్చారు. సరైన స్క్రిప్టు లేకుండానే సినిమాలకు సిద్ధమవుతాడనే ఆరోపణలకు చెక్ పెట్టడానికి నక్షత్రానికి పక్కా బౌండ్ స్క్రిప్ట్‌తో సిద్ధమయ్యాడు. కానీ నక్షత్రం సినిమా చూస్తే అసలు కృష్ణవంశీ తీసిన సినిమానేనా అనే సందేహం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నది.

లోపాలు స్పష్టంగా..

లోపాలు స్పష్టంగా..

కృష్ణవంశీ ఎంచుకొని కథలు, తీసే విధానం చూస్తే చాలా లోపాలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించాయి. మనసుకు హత్తుకొనే విధంగా, గుండెను పిండేసే విధంగా తీసే సన్నివేశాలు నక్షత్రంలో ఎక్కడా కనిపించ లేదు. గొప్ప గొప్ప చిత్రాలను తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన రికార్డు ఉన్న కృష్ణవంశీలో క్రియేటివ్ డైరెక్టర్ అసలు కనిపించరేమిటీ అనే అనుమానం ప్రేక్షకుడిని పీడిస్తున్నది.

కృష్ణవంశీ కోసం క్యూ..

కృష్ణవంశీ కోసం క్యూ..

ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా ప్రేక్షకుల్లో కృష్ణవంశీపై నమ్మకం తగ్గలేదనడానికి నక్షత్రం చిత్రమే ఓ ఉదాహరణ. ఉదయమే 9 గంటల షోకు ముందే మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకులు క్యూ కట్టడం సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ కోసం కాదనేది వాస్తవం. రెజీనా, ప్రగ్యా జైస్వాల, శ్రీయ అందాల ఆరబోతకు వచ్చారనే అసత్యం. కేవలం కృష్ణవంశీ ఈ సినిమాతోనైనా మ్యాజిక్ చేస్తారా అనే కొండంత అండతో వచ్చిన వారేనని సత్యం. సినిమా చూసిన తర్వాత అభిమానుల నోట ‘కృష్ణవంశీకి ఒక్క హిట్ పడి ఉంటే బాగుండు బాసూ అనే మాట వినిపించడం గమనార్హం. బాసూ ఇక నైనా ఒక్క హిట్ ఇస్తారా బాసూ..

English summary
Krishna Vamsi is known as Creativ Director in Tollywood. Earlier His movie shakes the box office. Recent times Krishna Vamsi movies are not upto the mark. Latest movie Nakshatram also get flop talk. Now Krishna Vamsi desparately waiting for massive hit to regain his popularity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu