»   » బాలయ్య సింహాకు మహారాణి సెంటిమెంట్?

బాలయ్య సింహాకు మహారాణి సెంటిమెంట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత సంవత్సరం సూపర్ హిట్స్ మగధీర, అరుంధతి చిత్రాలలో కాదల్, అనూష్క ఇద్దరూ మహారాణి గెటప్స్ లలో కనపడి అలరించారు. ఇప్పుడు తాజాగా నయనతార కూడా తన తాజా చిత్రం సింహాలో మహారాణి గెటప్ లో కనపడుతోంది. దాంతో ఆ చిత్రాలను దృష్టిలో పెట్టుకునే ఆమెకు సెంటిమెంట్ గా ఈ గెటప్ వేయించారని వినపడుతోంది. ఈ సింహా స్టిల్స్ బయిటకు రాగానే అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన వస్తోంది. ఇక సింహా చిత్రంలో ఆమె పాత్ర ప్లాష్ బ్యాక్ లో కనిపించనుందని తెలుస్తోంది. అది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతారతో పాటు స్నేహా ఉల్లాల్, నమిత కూడా చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మహారాణి గెటప్ సెంటిమెంట్ ఈ చిత్రానికి ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలంటే చిత్రం రిలీజ్ కావాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu