»   » రజినీకాంత్‌పై సినిమానా...రూ.300 కోట్లు కావాలి

రజినీకాంత్‌పై సినిమానా...రూ.300 కోట్లు కావాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌పై సినిమా తీయాలంటే ఎంత కాదనుకున్నా సుమారు రూ.300- 400 కోట్లు కావాలని అంటున్నారు దర్శకుడు సాజిద్‌ నదియాద్‌వాలా. అందులోనూ ఆయనతో సినిమా తీయడం చాలా కష్టమని అంటున్నారు.

రోబో, శివాజీ తీసినందుకు దర్శకుడు శంకర్‌కి హాట్సాఫ్‌ అంటూ కితాబిచ్చారు సాజిద్‌. రజినీకాంత్‌పై సినిమా తీసేటప్పుడు ఆయనకున్న అభిమానులని దృష్టిలోపెట్టుకుని ఎంతో జాగ్రత్తగా తీయాలని చెప్పారు సాజిద్‌.

Will need Rs 300 crore to make film on Rajinikanth

రజనీతాజా చిత్రం విశేషాలకు వస్తే...

రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కబాలీ'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాధికా ఆప్టే నటిస్తోంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మలేసియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఒక డాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మహాదేవ' అనే టైటిల్‌ను పెడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రజనీకాంత్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత రజనీకాంత్ నటించే ‘రోబో-2' ఈనెల 12న ప్రారంభం కానుంది.

English summary
Director Sajid Khan says that to make a film on superstar Rajinikanth will be difficult and that he will require about Rs.300 crore for the same.
Please Wait while comments are loading...