For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దటీజ్ జూ. ఎన్టీఆర్.. ఆ నలుగురి ఫేట్ మారినట్టేనట.. 21నే అసలు విషయం..

  By Rajababu
  |

  జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన జై లవ కుశ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ జై లవకుశలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరి పరిస్థితి ఈ చిత్రానికి ముందు దారుణంగా ఉంది. వారేవరంటే నిర్మాత కల్యాణ్ రామ్, దర్శకుడు బాబీ. ఒకవేళ జై లవకుశ చిత్రానికి ఊహించని స్పందన వస్తే వారి పరిస్థితి మరింత గందరగోళం అవుతుందనేది ఇండస్ట్రీలో టాక్.. అలాగే సినిమా హిట్ అయితే వారిద్దరితోపాటు రాశీ ఖాన్నా, నివేదా థామస్‌ల కెరీర్ కూడా రాకెట్ స్పీడ్ అందుకొనే అవకాశం కనిపిస్తున్నది.

  బాక్సాఫీస్ వద్ద బోల్తా

  బాక్సాఫీస్ వద్ద బోల్తా

  ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నిర్మాతగా కల్యాణ్ రామ్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఆయన నటించిన సినిమాలకు కూడా ప్రేక్షకులు ముఖం చాటేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం దారుణంగా ఫ్లాపైంది. ఆ పరిస్థితుల్లో నిర్మాతగా, హీరోగా కల్యాణ్ రాం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  బాబీకి సినిమా కీలకం..

  బాబీకి సినిమా కీలకం..

  ఇక బాబీకి జై లవకుశ దర్శకుడిగా మూడో సినిమా. రవితేజతో తీసిన బలుపు మోస్తారుగా ఆడింది. పవన్ కల్యాణ్‌తో తీస సర్దార్ గబ్బర్ సింగ్ దారుణంగా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో బాబీ కెరీర్‌కి జై లవకుశ కీలకమైంది.

  జైలవకుశతో మారిన..

  జైలవకుశతో మారిన..

  ఈ చిత్రం విడుదల కాకముందే దర్శకుడు బాబీ హిట్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కొంత నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే జైలవకుశతో మళ్లీ బాబీ పుంజుకుంటాడని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

  ఎన్టీఆర్ సక్సెస్..

  ఎన్టీఆర్ సక్సెస్..

  నిర్మాతగా కల్యాణ్ రాం, దర్శకుడు బాబీ తలరాత మార్చే విషయంలో ఎన్టీఆర్ సఫలమయ్యాడనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ టాక్ విస్తరించింది. ఈ సినిమా హిట్ అనేది ఖాయమైంది. కానీ ఏ రేంజ్ హిట్ అనేది సెప్టెంబర్ 21నే తేలుతుంది.

  21న జై లవకుశ

  21న జై లవకుశ

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జైలవకుశ. ఈ చిత్రంలో తొలిసారి ఆయన త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదిత థామస్స్ నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్.

  రావణాసురుడి పాత్ర హైలెట్..

  రావణాసురుడి పాత్ర హైలెట్..

  అయితే మూడు పాత్రల్లో జై పాత్ర మాత్రం రావణాసురుడి పాత్ర చిత్ర పరిశ్రమ వర్గాల్లో వైరల్ అయింది. అభిమానుల్లో జోష్ నింపింది. అంతేకాకుండా జై పాత్ర ఎన్టీఆర్ కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురుపిస్తుందని ఇప్పటికే ఎన్టీఅర్ అభిమానులు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు.

  అందాల భామ ఫేట్ కూడా

  అందాల భామ ఫేట్ కూడా

  అంతేకాకుండా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించి ఆ ఇద్దరు అందాల భామల ఫేట్ .. జైలవకుశ విడుదల తర్వాత మారిపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరిద్దరికి తప్పకుండా పెద్ద హీరోల పక్కన నటించే ఛాన్సులు వెల్లువెత్తుతున్నాయి.

  English summary
  Junior NTR's fans can rejoice. The actor's upcoming film Jai Lava Kusa will release as per schedule after the Central Board of Film Certification cleared the film with 'U/A' certificate and without any cuts. The film features Junior NTR in triple roles - he plays the eponymous Jai, Lava and Kusa of the title. Before this film Kalyanram Nandamuri, CEO of NTR Arts, Director Bobby situation is in crisis. Reports suggest that, After this movie release These two fate will changed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X