ఈసారైన రాజ్ తరుణ్ హిట్ కొడతాడా ? రాజుగాడు ట్రైలర్ రేపే విడుదల!
యువహీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కాస్త వెనక్కు తగ్గాడు. తాజాగా ఈ హీరో నటించిన రంగులరాట్నం సినిమా అంధగాడు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ హీరో నటించిన రాజుగాడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నూతన దర్శకురాలు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటించగా నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కాస్త వెనక్కు తగ్గాడు. తాజాగా ఈ హీరో నటించిన రంగులరాట్నం సినిమా అంధగాడు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ హీరో నటించిన రాజుగాడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్రీకరణ పూర్తై చాలా రోజులు అయినా కొని అనివార్య కారణాల వలన వాయిదాపడిన సంగతి తెలిసిందే.

రాజుగాడు సినిమా జూన్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ఇదివరకే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించగా ట్రైలర్ ను రేపు (మే 11) సాయంత్రం 5గంటలకు విడుదలచేయనున్నారు. సంజన రెడ్డి అనే నూతన దర్శకురాలు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటించగా నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ఈ మూవీతో రాజ్ తరుణ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











