»   » వర్మ ను చెప్పులతో కొడతాం, అతని సినిమాలకు పని చేయం

వర్మ ను చెప్పులతో కొడతాం, అతని సినిమాలకు పని చేయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్స్‌తో దుమారం రేపాడు. మహిళా దినోత్సవం సందర్భంగా వర్మ చేసిన ట్వీట్స్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలంతా సన్నీలియోన్‌లా సంతోషాన్ని పంచాలంటూ వర్మ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. వర్మ ఆ తర్వాత కూడా కొన్ని ట్వీట్స్ చేశాడు. సన్నీలియోన్ పేరు ప్రస్తావిస్తూ వర్మ చేసిన ట్వీట్‌పై గోవాకు చెందిన సామాజిక కార్యకర్త విశాఖ మంబ్రే కేసు కూడా ఫిర్యాదు చేశారు.

మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వర్మ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నాయకురాలు విద్యా చవాన్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే వర్మను చెప్పులతో కొడతామని తీవ్రంగా హెచ్చరించారు.,,మరోవైపు వర్మ సినిమాలకు పనిచేయకూడదని సినిమా సెట్టింగ్, దాని అనుబంధ కార్మికుల సంఘం నిర్ణయించింది. ఈ సంఘంలో 52 వేల మంది సినీ కార్మికులు ఉన్నారు.

Will try to beat him with shoes, says NCP leader

కాగా మాంబ్రే ఫిర్యాదుపై కూడా వర్మ తన శైలిలోనే స్పందించాడు. సన్నీలియోన్‌ను ఫాలో అవుతున్న 18లక్షల మందిని అవమానించినందుకు 212 మంది సామాజిక కార్యకర్తలపై కౌంటర్ ఫిర్యాదు చేస్తానంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇది ఉమెన్స్ డే మాత్రమేనా.. ఉమెన్స్ నైట్ కాదా అని వర్మ ట్వీట్ చేశాడు. నేను తల్లులని, కూతుళ్లని, చెల్లెళ్లని, అమ్మలని తప్ప మిగతా అందరు స్త్రీలని చాలా గౌరవిస్తూ ప్రేమిస్తానని వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పక్కన కృష్ణ రావణ్ శర్మ అని వర్మ తన పేరును వెరైటీగా మార్చి ట్వీట్ చేశాడు.

English summary
RGV who offended many people by making a sexist remark through his tweet on the occasion of the International Women’s Day on Wednesday, had a heated exchange of words with NCP leader Jitendra Awhad on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu