»   » ‘విన్నర్’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

‘విన్నర్’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. శివరాత్రి పురస్కరించుకుని సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది.

సినిమాకు సంబంధించి రిపోర్ట్ బయటకు వచ్చింది. దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా మొదటి భాగం మొత్తాన్ని కామెడీ, యాక్షన్ బేస్ చేసుకుని రన్ చేసారు. హీరో, హీరోయిన్ వెంట పడటం లాంటి రోటీన్ సీన్లతో సినిమా సాగింది.


Winner movie public talk and highlights

పద్మ పాత్రలో వెన్నెల కిషోర్, సింగం సుజాత పాత్రలో పృధ్వితో కామెడీ పండించడంతో పాటు తీన్మార్ న్యూస్ ద్వారా పాపులర్ అయిన బిత్తిరి సత్తితో కూడా కామెడీ చేయించి ఫస్టాఫ్ లాగించేసారు. ఎప్పటిలాగే పృధ్వి తనదైన మేనరిజంతో 'సింగం సుజాత' పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. సింహాన్ని అడవిలో, జూలో, యూట్యూబ్ లో చూసుంటారు కానీ యూనిఫాంలో చూసుండరు అంటూ పృథ్వి తనదైన డైలాగ్ డెలివరీతో అలరించాడు.


సెకండాఫ్ లో కూడా కథ చెప్పే విధానం కూడా యావరేజ్ ఉందని పలువురు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. మొత్తానికి 'విన్నర్' మూవీపై ఫస్ట్ షోకే జస్ట్ యావరేజ్, రొటీన్ సినిమా అనే టాక్ స్ప్రెడ్ అయింది. మరికొద్ది నిమిషాల్లో ఫిల్మీబీట్ క్రిటిక్స్ అందించే రివ్యూ మీ ముందుకు రాబోతోంది. వేచి ఉండండి....


సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

English summary
Director Gopichand Malineni's Telugu movie Winner featuring Sai Dharam Tej and Rakul Preet Singh in the lead roles, is a much-hyped and highly-awaited film and it is set to be released in theatres around the world on 24 February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu