»   » జంతువులని హింసించలేదనే సర్తిఫికెట్ లేదు.., విన్నర్ వాయిదా వెనుక నిజం ఇదీ

జంతువులని హింసించలేదనే సర్తిఫికెట్ లేదు.., విన్నర్ వాయిదా వెనుక నిజం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' మూవీ ట్రైలర్ నిన్న విడుదల కావాల్సి ఉన్నా ఆఖరినిమిషం లో విడుదల వాయిదాపడ్దట్టు ప్రకటించటం తో ఉత్సాహంగా ఎదురు చూసిన వాళ్ళు కాస్త నిరాశపడ్డారు. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉన్న నేపధ్యంలో ఇలా ట్రైలర్ ను విడుదల చేయకపోవడం పై చాలామంది ఆశ్చర్యం వ్యక్తపరిచారు.

ఇలా సినిమా రిలీజ్ కు ఇంకా కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ట్రైలర్ ను రిలీజ్ చేయలేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ దెబ్బతో మూవీ రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు హల్ చల్ చేశాయి. మరోవైపు, చిత్ర యూనిట్ సాంకేతిక కారణాలతో ట్రైలర్ వాయిదా పడిందని చెబుతూ.. ఇంకొన్ని రోజుల్లోనే రిలీజ్ చేస్తామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.


Winner Trailer Stopped by Animals

అయితే అసలు సంగతి ఇప్పుడు చెప్పారు. వినడానికి చదవడానికి ఈ న్యూస్ ఆశ్చర్యకరంగా ఉన్నా అసలు సంగతి మాత్రం ఇదే.'విన్నర్' సినిమాలో కొన్ని జంతువులు కూడ కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ మెగా యంగ్ హీరో ఈ సినిమాలో చేసిన గుర్రపు స్వారి సీన్స్ చాల ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో ఉన్న కొన్ని నిబంధనల ప్రకారం ఇటువంటి సన్నివేశాలను సినిమాలలో పెట్టినప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుండి అనుమతి తీసుకోవాలి.


లేదంటే ఆ సినిమా ప్రదర్శణని నిలుపు చేత్యించే హక్కు బోర్డుకు ఉంటుందని ఈ నిబందనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలు సినిమాకే కాదు.. ట్రైలర్‌కు కూడా వర్తిస్తాయి. ట్రైలర్ లోకూడా గుర్రపు స్వారీ సన్నివేశాలుండతం తో నో అబ్జెక్షన్ సర్తిఫికెట్ తీసుకోవాల్సి వచ్చింది. 'విన్నర్‌' చిత్ర బృందం ఈ ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ట్రైలర్‌ విడుదల చేయాలనుకున్న సమయానికి అనుమతి రావడం ఆలస్యమైందట. అందువల్లే అనుకున్న సమయానికి ట్రైలర్‌ విడుదల కాలేకపోయింది. ఆ సర్టిఫికెట్‌ వచ్చిన వెంటనే ట్రైలర్‌ రిలీజ్‌ చేయడానికి సిద్ధంగా ఉందట 'విన్నర్‌' టీమ్‌.

English summary
The trailer of Sai Dharam Tej’s starrer romantic entertainer ‘Winner’ which was scheduled to be launched on 9th February was postponed to an undisclosed date at the last moment. According to the latest update, the makers are waiting for the clearance certificate from the Animal Welfare Board of India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu