»   » ఎప్పుడూ కత్తిని వెంట తీసుకెళ్లండి:శిల్పాషెట్టి

ఎప్పుడూ కత్తిని వెంట తీసుకెళ్లండి:శిల్పాషెట్టి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ముంబయి: స్వీయ రక్షణ విషయంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలనీ...సదా ఓ కత్తిని వెంట ఉంచుకోవాలనీ బాలీవుడ్‌ నటి శిల్పాషెట్టి సూచించారు. దురుద్దేశంతో హానికి తెగబడే దుండగుల నుంచి రక్షణ పొందడానికి కత్తి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. పోలీసులు ప్రజారక్షణకు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. అయినప్పటికీ, మానసిక రోగపీడితులైన కొందరు మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతూనే ఉన్నారన్నారు.

  పోలీసులు మాత్రం ఎంతనిచేస్తారు....వారిపై మోయలేని భారాన్ని మోపడం ఎందుకు. మనమే జాగ్రత్త పడాలన్నారు. అందుకే, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కత్తిని వెంట తీసుకెళ్లాల్సిందేనని శిల్పాషెట్టి పునరుద్ఘాటించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.


  ఇక కామన్వెల్త్‌ క్రీడల అవినీతి కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులు నటి శిల్పాశెట్టికి రూ.71.73 లక్షలు చెల్లించినట్లు ఢిల్లీ కోర్టు తెలిపింది. 2008లో కామన్వెల్త్‌ యువజన క్రీడల ముగింపు వేడుకలో శిల్పాశెట్టి ఒక ప్రదర్శన చేశారు. దానికి గాను కల్మాడీ సూచనల మేరకు పీడీ ఆర్య, ఏకే మదన్‌ అనే ఇద్దరు ఆమెకు రూ.71.73 లక్షలు చెల్లించారు. వీరిద్దరూ 2010లో కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణంలో నిందితులు. కామన్‌వెల్త్‌ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

  ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్‌ భానోత్‌ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. నిందితులు ప్రభుత్వానికి రూ.90 కోట్లు నష్టం కలిగించారన్న ఆరోపణలపై భారత శిక్షాస్మృతిననుసరించీ, అవినీతి నిరోధక చట్టం కింద ఈ అభియోగాలు ఉన్నాయి.

  కుంద్రాకు బెట్టింగుతో సంబంధం ఉన్నప్పటికీ స్పాట్ ఫిక్సింగ్‌‍తో మాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కుంద్రాను మరోసారి విచారణకు పిలుస్తామని కూడా పోలీసులు అంటున్నారు. కుంద్రా సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయిన విషయం తెలిసిందే.

  English summary
  The 38-year-old actor was speaking at Bhaidas Hall in Vile Parle on the sidelines of a programme organised by the city police to create awareness among the Ganesh mandals about the safety and security during the ten-day Ganesh festival starting from Monday. Urging women to become "self-reliant", Bollywood actress Shilpa Shetty on Saturday recommended them to carry a knife to protect themselves from molesters.
 "Some people and molesters have a sick mentality... Police are doing their best to protect us, but how much they would do? Women should be self-reliant and carry a knife when they are in crowd," the actress told reporters here when her opinion was sought against the backdrop of recent assaults on women and gang-rapes in the metropolis.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more