twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలా... వద్దు బాబోయ్ అంటున్నాడు

    By Srikanya
    |

    ముంబయి: అమితాబ్‌ బచ్చన్‌ తాజా చిత్రం 'భూత్‌నాథ్‌ రిటర్న్స్‌'లోనూ ఎన్నికల వాతావరణ కనిపిస్తుంది. అవినీతితో కూడుకున్న రాజకీయాలు-నేతల గురించి ఈ చిత్రంలో చూపించడమే కాకుండా ఓటు ప్రాముఖ్యతను కూడా వివరించారు దీనిలో. చిత్రం విడుదలైన కొన్నిరోజుల్లోనే రూ.20 కోట్లకుపైగా ఆర్జించి అమితాబ్‌ హవా ఇంకా తగ్గలేదని నిరూపించింది. చిత్రం ఎన్నికలకు సంబంధించిందే కావడంతో అందరూ అమితాబ్‌ను రాజకీయాలకు సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతున్నారు.

    'మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఏ పార్టీ అయినా మీకు టిక్కెట్టును ఇవ్వడానికి ముందుకు వచ్చిందా?' అంటూ ఆయనను వూపిరి సలపనివ్వడం లేదు. అయితే తనకు ఆ ఉద్దేశం లేదని, రాజకీయాలు తనకు పడవు అని ఆయన చెప్తున్నారు. కానీ అమితాబ్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదన్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబానికి ఆప్తుడైన అమితాబ్‌.. రాజీవ్‌గాంధీ కోరికపై కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు మీద 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్‌ నుంచి పోటీ చేసి యూపీ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.ఎన్‌ బహుగుణపై భారీ మెజారిటీతో గెలుపొందారు కూడా.

    Won't return to politics, says Amitabh Bachchan

    మూడు సంవత్సరాల అనంతరం ఒక భారీ కుంభకోణంలో అమితాబ్‌ పేరు ప్రస్తావనకు రావడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయాలవైపు ఏనాడూ తిగిగి చూడలేదు. అమితాబ్‌ గుజరాత్‌ పర్యాటక శాఖకు ప్రచారకర్తగా పనిచేయడంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా ప్రచారంలో ఆయన్ని చూడవచ్చుననుకున్న వారికి నిరాశే ఎదురైంది.

    గుజరాత్‌లోని చారిత్రాత్మక ప్రదేశాలు, ఆ రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే ప్రచారం చేశానని, ఏ పార్టీకి తాను రాయబారిగా వ్యవహరించలేదంటారు బిగ్‌ బి. కానీ జయా బచ్చన్‌ సమాజ్‌వాదీ పార్టీ తరఫున రెండుసార్లు రాజ్యసభకు ఎంపిక కావడం చెప్పుకోదగ్గ విషయం.

    ఇక నటన నుంచి రిటైర్‌ అయ్యే యోచనేది లేదని బిగ్‌'బి' అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. తాను కనుక ఒకవేళ నటన నుంచి రిటైర్‌ అయితే...జబ్బున పడిపోవడం ఖాయమని ఆయన చెపాపరు.అందుకే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేస్తుండాలి. అప్పుడే మన శరీరం, మనసు కూడా బిజీగా ఉంటాయన్నారు. అందుకే, తాను ఎప్పుడూ కూడా కొత్తసవాళ్లను ఎదుర్కొవాలని అనుకుంటానన్నారు.

    English summary
    "I am apolitical and no, I shall not join politics." says Amitabh Bachchan. The 71-year-old, who had contested Lok Sabha elections from Allahabad in 1984 and registered a massive win, resigned after three years of his tenure as an MP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X