»   » బిపాసా లవ్లీ లేడీ, ఇలా చేస్తుందనుకోలేదు: నిర్మాత ఫైర్

బిపాసా లవ్లీ లేడీ, ఇలా చేస్తుందనుకోలేదు: నిర్మాత ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీ హీరోయిన్ బిపాసా బసుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇకపై ఫ్యూచర్లో ఆమెతో కలిసి పని చేయనని ఆయన తేల్చి చెప్పారు. వాసు భగ్నానీ నిర్మించిన 'హమ్‌షకల్స్' చిత్రంలో బిపాసా నటించింది. బిపాసా బసుపై ఆయన ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం ఆమె సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటమే. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హమ్‌షకల్స్' చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్, సైఫ్ అలీ కాన్, రామ్ కపూర్, ఇషా గుప్తా, తమన్నా, బిపాసా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

వాసు భగ్నానీ మాట్లాడుతూ 'ఇక ఫ్యూచర్లో ఎప్పుడూ బిపాసా బసుతో పని చేయను. నేను ఇలామాట్లాడ కూడదు. కానీ ఆమె చేసిన పనికి ఇలా మాట్లాడక తప్పడం లేదు' అని వాసు భగ్నానీ తెలిపారు. సినిమాకు నటీనటుల ఎంపిక జరిగేప్పుడు నేనే స్వయంగా బిపాసాను తీసుకోవాలని సాజిత్ ఖాన్‌కు చెప్పాను. ఆమె లవ్లీ లేడీ. కానీ ఆమె సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ప్రమోషన్లకు హాజరు కాలేదో తెలిదు' అని వ్యాఖ్యానించారు.

Won't work with Bipasha in future: Humshakals Producer

కాగా...బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం బిపాసా అసంతృప్తికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు బిపాసా కంటే తమన్నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై బిపాసా అసంతృప్తిగా ఉందట. సీనియర్లను వదిలేసి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని గుర్రుగా ఉందట. మరో వైపు ఈ చిత్రంలో తమన్నా ఇష్టప్రకారమే నడుచుకుంటున్నాడు దర్శకుడు. ఓ సీన్లో సినిమాలోని ముగ్గురు భామలు బికేనీ వేయాల్సిఉంది. అయితే తమన్నా బికినీ వేయనని చెప్పడంతో....ఆమెతో షార్ట్ వేయించి, మిగతా ఇద్దరినీ బికినీలో చూపించారు.

English summary
Producer Vashu Bhagnani is so upset Bipasha Basu, one of the female leads in his just released “Humshakals”, that he has decided not to work with her again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu