»   » స్టార్స్ తో వర్కింగ్ రిలేషన్ షిప్పే... కాజల్

స్టార్స్ తో వర్కింగ్ రిలేషన్ షిప్పే... కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను నా కో స్టార్స్ తో కేవలం వర్కింగ్ రిలేషన్ షిప్ ని మాత్రమే మెయింటైన్ చేస్తాను. అలాగే ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత రోజూ ఫోన్ లలో టచ్ లో ఉండటం, కలిసి తిరగటం వంటివి చేయను. కానీ మళ్ళీ ఎక్కడన్నా కలిస్తే మాత్రం గడిచిన రోజులు గుర్తు చేసుకుని పలకరిస్తాను అంటోంది కాజల్. ఆమెని కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది. అలాగే తను ప్రత్యేకంగా జీవితంలో ఏమైనా మిస్సయినట్లు భావిస్తోందా అన్నదానికి సమాధానంగా నా వయస్సు ఆడపిల్లలు ఆనందంగా గడుపుతూంటే నేను వర్క్ లో మునిగిపోవటం అప్పుడప్పుడూ భాధ అనిపిస్తుంది. అయిత నన్ను నేను సర్ధిచెప్పుకుంటూ...టైమ్ వచ్చినప్పుడు, ఎవరో ఒకరిని రైట్ ప్లేస్ తగులుతారు. అప్పటివరకూ...నేను వర్క్ ని ఎంజాయ్ చేస్తూ బ్రతికేస్తాను అంది. ఇక మగధీర తర్వాత స్టార్ గా మారిపోయిన కాజల్ ప్రస్తుతం ప్రభాస్ సరసన డార్లింగ్ లోనూ, ఎన్టీఆర్ తో బృందావనంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu