»   » రాజమౌళి రాజయోగం ముగిసిందట.. మరో ఏడేళ్లు కష్టాలే కష్టాలు.. ప్రతిష్ఠకు భంగం!

రాజమౌళి రాజయోగం ముగిసిందట.. మరో ఏడేళ్లు కష్టాలే కష్టాలు.. ప్రతిష్ఠకు భంగం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సిరీస్‌తో దర్శకుడు శ్రీశైల (ఎస్ఎస్) రాజమౌళి దేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక దక్షిణాదిలోనైతే రాజమౌళి నామస్మరణే కనిపిస్తున్నది. దక్షిణాదిలో ఎన్నో సంచలన చిత్రాలను అందించిన డైరెక్టర్లను సైతం వెనక్కి నెట్టడం గమనార్హం. ఇదంతా కేవలం ఓవర్‌నైట్‌లో జరిగిపోయింది కాదు. దేశ సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానానికి ఎదిగిన రాజమౌళి అంకుఠిత దీక్ష, సినిమాపై ఉన్న వ్యామోహం, ప్రేమ అతడిని ఆ స్థానానికి తీసుకెళ్లాయి. ఈ విధంగా రాజమౌళి గ్రాఫ్ పెరుగడానికి గ్రహ, జాతక బలమనే కారణమంటున్నారు జ్యోతిష్యులు.

మహర్ధశ ముగింపు..

మహర్ధశ ముగింపు..

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జాతకం ప్రకారం రాజమౌళికి కొన్నేళ్ల నుంచి మహర్ధశ నడుస్తుందట. ఈ దశ మరి కొన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశముందని జ్యోతిష్కుల అభిప్రాయం. సినిమా పరిశ్రమలో ఎవరూ నమ్మినా, నమ్మకపోయినా జాతకాలు, ముహుర్తాలు కీలక పాత్ర వహిస్తాయి. ముహుర్తాలు, జాతకాలపై నమ్మకం లేకపోయినా కోట్లు పెట్టి సినిమా నిర్మాణాలు చేపట్టేటప్పుడు భయపడో లేదో భక్తితోనే ఆచారాలను పాటిస్తుంటారు.

జాతకబలం వల్లనే సాధ్యం..

జాతకబలం వల్లనే సాధ్యం..

రాజమౌళి జాతకం ప్రకారం ఆయన నక్షత్రం పూర్వభద్రం. మూడో పాదం. కుంభరాశి అని వేణుస్వామి చెప్పాడు. జాతకరీత్యా తుల లగ్నంలో బుధుడు ఉన్నాడు. సినీ పరిశ్రమకు సంబంధించి బుధుడు అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటాడు. ఈ దశలో ఉన్నవారు మనస్సు, బుద్ధిబలం ఇతరలకు పనిచేయని విధంగా దోహదపడుతాయి అని చెప్పారు. ఈ జాతకబలం ఉన్న వ్యక్తులు ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకొంటే దానిని చాలా సులభంగా సాధిస్తారు. జాతకం బలం వల్లనే రాజమౌళికి సాధ్యమైందని, బాహుబలిని వేరే వ్యక్తులు తీసినా అంత ఖ్యాతి దక్కదని వేణుస్వామి వెల్లడించారు.

సినిమాల విజయం వెనుక..

సినిమాల విజయం వెనుక..

సాంఘీక చిత్రమైనా, సాంకేతిక సినిమానైనా, చారిత్రక కథ నేపథ్యమైనా రాజమౌళి చేసే అంటెప్ట్ గ్రాండ్‌గా ఉంటుంది. సాంఘీక చిత్రాలలో ఆయన తీసిన సింహాద్రి నుంచి ఛత్రపతి వరకు, సాంకేతికంగా ఈగ నుంచి బాహుబలి వరకు రాజమౌళి ముద్ర కనిపిస్తుంది. సునీల్ పెట్టి మర్యాద రామన్న తీసినా, సమంతను పెట్టి ఈగ సినిమాను తెరకెక్కించినా విజయంపై ఎనలేని విశ్వాసం. ఇంతటి ధీమా వెనుక ప్రస్తుతం ఆయన జాతకబలమనే జ్యోతిష్కులు పేర్కొంటున్నారు.

మే 2 నుంచి కేతువు దశ..

మే 2 నుంచి కేతువు దశ..

ప్రస్తుతం జక్కన జాతకం ప్రకారం ఆయనకు రాజయోగం దశ నడుస్తుందట. అయితే మే 2 తేదీ నుంచి కేతువు మహార్ధశ ప్రారంభమవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేర్కొంటున్నారు. కేతువు మహార్ధశ మరో ఏడేళ్లు ఉంటుందని.. ఈ కాలంలో రాజమౌళికి అనేక కష్టాలు వస్తాయట. బాహుబలి సినిమా వల్ల వచ్చిన పేరు పత్రిష్ఠలు మసకబారే పరిస్థితి ఉందని వేణుస్వామి చెప్తున్నారు.

2014 వరకు కష్టాలే కష్టాలు..

2014 వరకు కష్టాలే కష్టాలు..

రాజమౌళి కెరీర్ శాంతి నివాసం అనే టెలివిజన్ సీరియల్‌తో ప్రారంభమైంది. ఆ సీరియల్‌కు ముహుర్తం తానే పెట్టాటని వేణుస్వామి చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి య్యూటుబ్‌లో వైరల్ అవుతున్నది. 2017, మే 2 తేది నుంచి కేతువు దశ ప్రారంభమై 2024 వరకు ఉంటుంది అని అప్పటి వరకు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత శుక్ర మహార్ధశ ప్రారంభమమై ఆయనకు మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణుడు సుమన్ జూపూడి చెప్పారు.

వర్మ ప్రతిష్ఠ భ్రష్టు వెనుక అదే..

వర్మ ప్రతిష్ఠ భ్రష్టు వెనుక అదే..

జాతక బలం సరిగా లేకపోవడం వల్లనే రాంగోపాల్ వర్మ జీవితం ప్రస్తుతం ఊగిసలాటలో ఉందని, శనిగ్రహం మీద ఉండటం వల్లనే చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తుంటారని ఆయన చెప్పారు. జాతకబలం వల్లనే ఇతర ప్రముఖులు రానటువంటి పద్మ అవార్డు, రివార్డులు ఆయనకు సొంతమయ్యాయి.

English summary
Director Rajamouli now enjoying great honour and pride other than any film personality. Some of the Astrolgers saying that His astrological aspects lead him to top position in film indutry. After Baahubali, there will be a rough patch for him in his carrer until 2024.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu