»   » తెర వెనుక కూడా: మోహన్ లాల్ ఓ డీప్ రొమాంటిక్ పర్శన్...ఇదిగో సాక్ష్యం

తెర వెనుక కూడా: మోహన్ లాల్ ఓ డీప్ రొమాంటిక్ పర్శన్...ఇదిగో సాక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ లాలా..ఓ కంప్లీట్ యాక్టర్, నటనలో మాస్టర్, రొమాంటిక్ రోల్స్ ప్లే చేయటంలో ఆయనకు సాటి ఇంకొకరు లేరు. ఓకే..ఇవన్నీ ఆయన గురించి తెలిసున్న విషయాలే. అయితే ఇప్పుడు మరో విషయం చెప్పబోతున్నాం. అది మరేదో కాదు తెర మీదే కాదు తెర వెనక అంటే తన నిజ జీవితంలో మోహన్ లాల్ ఓడైహార్డ్ రొమాంటిక్ పర్శన్ గా ప్రూవ్ చేసుకున్నారు.

అబ్బబ్బే కంగారుపడి ఈ కథనంపై మీరో కంక్లూజన్ కు వచ్చేయకండి. నేను చెప్పబోయేది ఆయన సాంసారిక జీవితం గురించి. రీసెంట్ గా ఆయన తన బార్య సుచిత్రను ఎలా కలుసుకున్నారు, ఎలా వివాహం చేసుకున్నారో వివరించారు. మాతృబూమి అనే మళాయయాళి పత్రిక కోసం ఆయన ఇంటర్వూ ఇస్తూ పలు విషయాలు ప్రస్దావించారు. ఆమె తన కోసం ఎంత సైలెంట్ గా వెయిట్ చేసిందో, దాదాపు రెండేళ్ల పాటు తనను గమనిస్తూనే ఎలా గడిపిందో..ఆ ప్రేమ కథను లీక్ చేసేసాడు.

ఆసక్తిగా ఉంది కదూ... అది 1986. మోహన్ లాల్, ఆయన భార్య కుటుంబం రెండూ వీళ్లిద్దరకి వివాహం చెయ్యాలని నిర్ణయించున్నాయి. అయితే ఆ తర్వాత వారు ఆ ప్రపోజల్ ని విరమించుకున్నాయి. ఎందుకయ్యా అంటే జాతకాలు కలవటం లేదని.

ఆ తర్వాత మోహన్ లాల్ తన కెరీర్ లో పడి పూర్తిగా సుచిత్రను ఆమె ప్రపోజల్ ని మరిచిపోయాడు. ఆ తర్వాత రెండేళ్ళ అనంతరం మోహన్ లాల్ ఓ షూటింగ్ నిమిత్తం కాలికట్ వెళ్లినప్పుడు అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ బాబు ఇంట్లో వాళ్ల ప్యామిలీతో కలిసి ఉన్నాడు.

ఆ తర్వాత ఆ ఊళ్లో ఉండగా... అక్కడే ఉన్న సుచిత్ర నుంచి ప్రపోజల్ అయ్యింది. నిజానికి రెండు జాతకాలు కలిసాయి అని తెలుసుకున్నారు. అంతేకాదు ఆమె మోహన్ లాల్ కోసం గత రెండేళ్లు గా సైలెంట్ గా ప్రేమిస్తూ ఎదురూచూస్తోందని తెలుసుకున్నాడు.

తర్వాత ఆ ప్రపోజల్ గురించి మళ్లీ మళ్లీ సీరియస్ గా ఆలోచిస్తూ మూకమాంబికా టెంపుల్ కు ఒక్కడే వెళ్లాడు. అక్కడ ఊహించని విదంగా సుచిత్ర, ఆమె తల్లి కనపడ్డారు. దాంతో భగవంతుడు ఆమెనే తన భార్యగా ఎంచాడని నిర్ణయించుకున్నాడు.

ఇప్పటికి ఈ జంట గత 28 సంవత్సరాలుగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు, ప్రణవ్, విశ్మయ. ఇప్పుడు మోహన్ లాల్, ఆయన భార్య సుచిత్ర తిరిగి కాలికట్ వచ్చారు. అదే కదా వీరి ప్రేమ కథలో కీలక పాత్ర వహించింది.

ఈ సందర్బంగా ఆయన తెర మీద ప్రేమ కథల్లో కీలకపాత్ర వహించిన హీరోయిన్స్ ని చూద్దాం..

ఆయన బార్యతో

ఆయన బార్యతో

మోహన్ లాల్ ఆయన బార్యతో కలిసి ఉన్న ఫొటో ఇది. అప్పట్లో దిగిన ఈ ఫొటో ప్రతీ మోహన్ లాల్ అభిమానికి ఇష్టమైనదే.

హైలీ సపోర్టివ్

హైలీ సపోర్టివ్

మోహన్ లాల్ హైలీ సపోర్టివ్ కో యాక్టర్ అని ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ అంతా చెప్తూంటారు. మోహన్ లాల్ లో ఉన్న గొప్పతనం అంతా ఆయన కోస్టార్స్ కు ఇచ్చే గౌరవం లోనే ఉందంటారు ఆయనతో పనిచేసిన వాళ్లంతా.

గ్రేట్ కెమిస్ట్రీ

గ్రేట్ కెమిస్ట్రీ

మోహన్ లాల్ తో ఆయన హీరోయిన్స్ కు గొప్ప కొమిస్ట్రీ కుదిరేదని ఆయా దర్శలు చెప్తూంటారు.

ఇంటిమసి

ఇంటిమసి

తెర మీద నటించేటప్పుడు ఆ క్లోజ్ నెస్ కనపడటం కోసం షూటింగ్ గ్యాప్ లో వారితో చాలా ఇంటిమసిగా ఉండేవాడని అంటారు.

మెస్మరైజ్

మెస్మరైజ్

ఆడియన్స్ ను మాత్రమే కాదు రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్స్ ని కూడా మెస్మరైజ్ చేసేవాడని చెప్తూంటారు.

ఏదైనా

ఏదైనా

మోహన్ లాల్ ఫన్నీ లవర్ బోయ్ గా చేసినా ఇంటెన్సిటీ కూడిన లవర్ బోయ్ గా చేసినా చాలా ఈజ్ తో చేసేవాడు.

పోటీపడి

పోటీపడి

నిజానికి ఆ గొప్పతనం తనది కాదు అంటాడు మోహన్ లాల్..తనతో పోటీ పడి మరీ నటించిన హీరోయిన్స్ ది అని చెప్తూంటారు ఆయన

మిగతావి ఎలా ఉన్నా

మిగతావి ఎలా ఉన్నా

మిగతా సినిమాల్లో ఎలా ఉన్నా మోహన్ లాల్ తో చేసేటప్పుడు మాత్రం ఆయన తో కాకుండా ఆయన నటనతో పోటీ పడాల్సి వచ్చేదని చెప్తారు.

ఎవరెవరు

ఎవరెవరు

శోభన, రేవతి, కార్తీక, ఊర్శసి, మంజు వారియర్ వీళ్లు ఆయనకు బెస్ట్ పెయిర్ గా చెప్తారు.

హిట్సే

హిట్సే

రొమాంటిక్ సీన్స్ పండించిన మోహన్ లాల్ సినిమాలన్నీ సూపర్ హిట్సే . అందుకే ఆయనతో పనిచేయటానికి హీరోయిన్స్ ఉత్సాహం చూపించేవారు.

కంఫర్ట్

కంఫర్ట్

అయితే తనకు హీరోయిన్స్ అందరిలోనూ శోభనతో నటించేటప్పుడు తనకు చాలా కంఫర్ట్ గా ఉండేదని చాలా ఇంటర్వూలలో చెప్పారు.

ఫెవరెట్ హీరోయిన్

ఫెవరెట్ హీరోయిన్

తనకు ఫేవరెట్ హీరోయిన్ మాత్రం మంజు వారియర్ అని మోహన్ లాల్ చెప్తూంటారు.

English summary
Now, Mohanlal has proven that he is a die-hard romantic person, in the real life as well. The actor recently revealed how he met his dear wife Suchitra and married her, through a special feature published in Mathrubhumi. Mohanlal fondly recalled how she silently waited for him, for almost 2 years.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu