»   » వావ్ ! సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' ఫస్ట్‌లుక్‌ (ఫొటో)

వావ్ ! సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' ఫస్ట్‌లుక్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'సుల్తాన్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్,సల్మాన్ ఖాన్ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఆ ఫస్ట్ లుక్ ని ఇక్కడ మీరూ చూడండి.

అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ తల్లిగా అలనాటి ప్రముఖ నటి రేఖ నటిస్తున్నారు. 2016 రంజాన్‌కి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్ తాజా చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' విశేషాలకు వస్తే...

సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ విషయాన్ని సోనమ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. సూరజ్‌ బర్‌జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్‌, సోనమ్‌ కపూర్‌లతోపాటు అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ పాటను ఇక్కడ చూడండి. రీసెంట్ గా పాట తాజాగా విడుదలైంది.

అలాగే..విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Wow! Salman Khan’s Look In Sultan

సౌత్ సినిమా రీమేక్‌ల్లో నటించడానికి ఆసక్తి కనబరుచే సల్మాన్‌ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ నటించబోతున్నాడు అనే మాట కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా మురుగదాస్‌ 'కత్తి' హిందీ రీమేక్‌లో నటించడానికి సల్లూభాయ్‌ పచ్చ జెండా వూపేశాడని సమాచారం.

''మురుగదాస్‌ చెప్పిన కథ సల్మాన్‌కు బాగా నచ్చినా ఆయన కోర్టు కేసుల్లో ఉండటంతో అప్పట్లో ఓకే చెప్పలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని అతుల్‌ అగ్రి హోత్రి నిర్మిస్తారు'' అని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

English summary
The first look of Salman Khan's much-awaited film Sultan is out. In a picture having a tagline- 'Wrestling is not a sport, it's about fighting what lies within', Salman looks every bit a wrestler in a beefed up look, intense eyes, cropped hair and moustache
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu