»   » అతనికీ నాకూ ఎఫైరుందనీ బాగా రాయండి ఫ్రీ పబ్లిసిటీ కదా... మొకమ్మీదే చెప్పేసింది

అతనికీ నాకూ ఎఫైరుందనీ బాగా రాయండి ఫ్రీ పబ్లిసిటీ కదా... మొకమ్మీదే చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన రష్మీ గౌతమ్‌ 'జబర్దస్త్‌' ప్రోగ్రామ్‌తో ఒక్కసారిగా సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేసింది. ఆ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమా అవకాశాలూ దక్కించుకుని సెక్సీ క్వీన్‌గా గుర్తింపుపొందింది. 'జబర్దస్త్‌' షోతోనే పాపులర్‌ అయిన మరో భామ అనసూయ పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేస్తుంటే.. రష్మీ చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు దక్కించుకుంటోంది.

మొదట్లో జబర్దస్త్ షోలో అనసూయ బదులు వచ్చిన రష్మి అంతగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని ఎపిసోడ్స్ ఇబ్బంది పడ్డా.. అమ్మడు ఇప్పుడు యాంకరింగ్ లో రాటుదేలింది. ఒకవిధంగా చెప్పాలంటే అనసూయని తలదన్నేలా యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంది. అంతేకాదు అమ్మడు షోలో వేసుకునే కాస్టూమ్స్ కూడా కొంచం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా ఉంటున్నాయి.

write about my Effire with Sudheer says Rashmi gautham

మరి రష్మి కావాలనే కాస్టూమ్స్ అలా వేసుకుంటుందో లేదా ప్రోగ్రామ్ కాస్టూమ్ డిజైనర్ అలాంటివి ఇసున్నారో తెలియదు కాని. జబర్దస్త్ లో స్కిట్ వేసేవాళ్ళ కన్నా రష్మిని చూసే వాళ్ళే ఎక్కువైపోయారు. ఇప్పుడు సినిమా ఇందస్ట్రీ లో కూడా చిన్న సినిమాలకి ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ రశ్మినే .. అందాల ప్రదర్శనలో కూడా పెద్దగా ఆమెకి అభ్యంతరాలేం లేకపోవటం కూదా చాలానే ప్లస్ అయ్యింది. రశ్మి బాటలోనే అనసూయ కూడా సినిమాల్లో ట్రై చేసినా అంతగా సక్సెస్ కాలేక పోయింది.

సినిమాల్లో ఎంత బోల్డ్‌ నటిస్తుందో.. బయట అంతే బోల్డ్‌గా మాట్లాడుతుంది. తాజాగా 'జబర్దస్త్‌' ఫేం సుధీర్‌తో లవ్‌ఎఫైర్‌ గురించి, యాంకర్‌ అనసూయతో గొడవ గురించి స్పందించింది. 'అనసూయతో నాకు ఎలాంటి గొడవలూ లేవు. మేమిద్దరం మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలం. మా లక్ష్యాలు వేరు.. మార్గాలు వేరు, నన్ను నేను రాకుమారిలాగా భావిస్తాను. నేనో సినిమా చేశానంటే దాని ద్వారా అందరికీ గుర్తుండిపోవాలి. చిన్న సినిమాలు చేయడానికి నాకు ఇబ్బందేమీ లేదు. అలాగే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు'' అని చెప్పిన రశ్మి. ఇక సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ గురించి మాట్లాడుతూ.. 'సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ ఉందో, లేదో నేను చెప్పను. సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ గురించి మాత్రం బాగా ప్రచారం చేయండి. బాగా రాయండి. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఆ విధంగానైనా ట్రెండ్‌ అవడం మంచిదే. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందులేమీ లేవు. నా లవ్‌ఎఫైర్‌ గురించే మాట్లాడుకోండి' అంటూ స్పందించింది.

English summary
Jabardast anchor Rashmi Gautam Reveals her afire with sudigali Sudheer. and she mentioned good things about Anasuya
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu