సినీ మాటల రచయిత గణేశ్‌పాత్రో కన్నుమూత
హైదరాబాద్ : సినీ మాటల రచయిత గణేశ్‌పాత్రో కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆయన గత కాలంకాలంగా కాన్సర్ బాధపడుతున్నారు. గణేష్ పాత్రో ప్రెయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వస్దలం విజయనగరం జిల్లా పార్వతీ పురం. నాటక రచయితగా గణేష్ పాత్రోకి మంచి పేరుంది. పలు తమిళ,తెలుగులలో ఆనేక చిత్రాలకు మాటలు రాసారు.
ఆయన రాసిన చిత్రాల్లో మరో చరిత్ర, ఇది కథ కాదు, రుద్రవీణ వంటివి పేరు తెచ్చుకున్నాయి. ఆయన ఆఖరి చిత్రం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. అలాగే ...కొడుకు పుట్టాలా నాటిక ఆయనకు మంచి పేరు తెచ్చింది.

గణేష్ పాత్రో....కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గా చెప్తూంటారు. చుట్టూ జరిగే సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు. ప్రస్తుతం చలన చిత్రాలకు కథలు, సంభాషణలు సమకూరుస్తున్నాడు.
ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











