»   » ప్రభాస్ లేకపోతే బహుబలి లేదు.. అప్పుడే రాజమౌళి కళ్లలో వెలుగు.. సీక్రెట్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్

ప్రభాస్ లేకపోతే బహుబలి లేదు.. అప్పుడే రాజమౌళి కళ్లలో వెలుగు.. సీక్రెట్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రీ రిలీజ్ పండుగ చూస్తుంటే ఐదేళ్లు వెనుక వెళ్లాలనిపిస్తున్నదని బాహుబలి కథా రచయిత విజేయేంద్ర ప్రసాద్ అన్నారు. కొన్ని అనుభవాలను పంచుకోవాలని ఉంది. ప్రభాస్‌తో సినిమా తీస్తున్నాను. కథ రాయండి నాన్నగారు అని అడిగారు. ఎలాంటి కథ అంటే రాజుల కథై ఉండాలి. నాకు ఫైట్స్ కావాలి. ఎమోషన్స్ ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. నాకు ఈ చిత్రంలో ఆడవాళ్లు చాలా పవర్ పుల్‌గా ఉండాలి. కథను వాళ్లే నడిపించాలి అని కండీషన్స్ పెట్టాడు. ఈ కథలో గ్రే కార్యక్టర్లు అంటే మంచివాళ్లు చెడుగా.. చెడ్డవాళ్లు మంచిగా వ్యవహరించే విధంగా ఉండాలి అని చెప్పాడని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

మూడో రోజున ఇక లైన్ చెప్పాను..

మూడో రోజున ఇక లైన్ చెప్పాను..

రాజమౌళి అడిగిన మూడో రోజున ఒక లైన్ చెప్పాను. అదే కట్టప్ప కథ. మహావీరుడి గురించి చెప్పించి.. ఆ వీరుడిని కట్టప్పతోనే చంపించిన సన్నివేశాన్ని చెప్పాను. అప్పుడు రాజమౌళి కళ్లలో వెలుగు చూశాను.

నదిలో మునిగి పొతున్న తల్లి..

నదిలో మునిగి పొతున్న తల్లి..

ఐదోరోజు ఒక తల్లి పసిబిడ్డతో నదీ దాటుతూ కొమ్మను పట్టుకొని బిడ్డను కాపాడి తాను మునిగిపోయే సన్నివేశం అది. అలా కొన్ని రోజుల వ్యవధిలో మరిన్ని సన్నివేశాలు చెప్పాను. దాంతో ఆ సన్నివేశాల ఆధారంగా అందమైన కథ తయారైంది. ఆ కల తెరమీద సాకారమైంది.

ప్రభాస్ డెడికేషన్ గొప్పది..

ప్రభాస్ డెడికేషన్ గొప్పది..

ఈ కల సాకారం కావడానికి కారణమైన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. అందులో ఒకరు ప్రభాస్. నాలుగు సంవత్సరాలపాటు డెడికేషన్ తో అద్భుతమైన పని చేశారు. ఆ నాలుగు సంవత్సరాల్లో ఆరు, ఏడు సినిమాలు చేసుంటే కోట్లు సంపాదించేవాడు. కానీ అలా చేయలేదు. కథను నమ్మాడు. అంకుఠిత దీక్షతో కృషి చేశారు.

నమ్మకం కలిగించిన రాజమౌళి

నమ్మకం కలిగించిన రాజమౌళి

ప్రభాస్‌కు నమ్మకం కలిగించింది దర్శకుడు రాజమౌళి. కేవలం ప్రభాస్‌కే కాదు. ఆర్టిస్టులందరికీ భరోసా కల్పించాడు. అద్భుతమైన దృశ్యకావ్యం తెరపైన కాబోతుంది అని విశ్వాసం కలిగించాడు రాజమౌళి.

ఏక సినిమా వ్రతం చేశారు..

ఏక సినిమా వ్రతం చేశారు..

ఏకపత్నివ్రతం అంటే ఏమిటో కానీ.. ఈ సినిమా కోసం ఇద్దరు ఏక సినిమా వ్రతం చేశారు. మరో సినిమా కోసం ఎదురు చూడలేదు వారిద్దరూ. వీరిద్దరి కంటే మరో వ్యక్తి పేరు చెప్పాలి. వారు శోభు యార్లగడ్డ, ప్రసాద్. ఏ నమ్మకంతో ఈ సినిమా కోసం ఖర్చపెట్టారో తెలియదు. కానీ అంచనాలకు మించి వారు రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు.

భయం, బెదురు కనిపించలేదు.

భయం, బెదురు కనిపించలేదు.

ఏ రోజు వారి కళ్లల్లో భయం, బెదురు కనిపించలేదు. నాగిరెడ్డి, చక్రపాణి, రామానాయుడు లాగా చిత్రాలు నిర్మిస్తూ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకొంటున్నాను అని ఉద్వేగంగా విజయేంద్ర ప్రసాద్ ప్రసంగాన్ని ముగించారు.

English summary
Writer Vijayedra prasad reveals secret behind Baahubali story. He said without Prabhas, Rajamouli there is no baahubali movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu