»   »  బాహుబలి-3 గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ ఇలా...

బాహుబలి-3 గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన దాదాపు 40 స్క్రిప్టులు రెడీ చేస్తున్నారట. ‘ఇదొక నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా నేను రాస్తూనే ఉంటాను. అందులో కొన్ని మాత్రమే వెండి తెరకు వస్తాయి అని చెప్పుకొచ్చారు' 72 సంవత్సరాల ఈ రైటర్.

ఓ ప్రముఖ దిన పత్రికతో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... ‘బాహుబలి-3' గురించి క్లూ ఇచ్చారు. వాస్తవానికి బాహుబలి రెండు భాగాలతోనే ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్వయంగా దర్శకుడు రాజమౌళి బాహుబలి-3 కూడా ఉంటుందని ప్రకటంచడంతో అంతా స్టన్నయ్యారు.

Writer Vijayendra Prasad Spills The Beans About Baahubali 3

బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో .... ‘బాహుబలి' సీక్వెల్స్ కొనసాగించాలని నిర్ణయించారు. అయితే బాహుబలి-1, బాహుబలి-2 కథలతో పెద్దగా సంబంధం లేకుండా ‘బాహుబలి-3' సినిమా ఉండబోతోంది. ‘బాహుబలి-3' ఉంటుంది కానీ.... పార్ట్-1, పార్ట్-2లతో సంబంధం లేకుండా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.

ఇక త్వరలో రాబోతున్న ‘బాహుబలి-2' గురించి వెల్లడిస్తూ.... ‘బాహుబలి-ది బిగినింగ్' సినిమాలో సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నకుల ‘బాహుబలి-ది కంక్లూజన్'లో సమాదానం దొరుకుతుందని, బాహుబలి తొలి భాగంలో మొదలైన స్టోరీ రెండో పార్టులో ముగుస్తుందని తెలిపారు.

English summary
Vijayendra Prasad said he is more eager to bring Baahubali 3 to the audience. "We will have far more freedom to go into the unexpected in the third part, as it won't be related to the first and second part of Baahubali. It will be an entirely new self-contained experience.", said the writer.
Please Wait while comments are loading...