ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఇదే 'పంచాక్షరి'
ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఇదే 'పంచాక్షరి'కథ అని కథారచయిత విప్పర్తి మధు చెప్పారు. అనుష్క నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'పంచాక్షరి'. సముద్ర దర్శకత్వంలో బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జూన్ 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్ర మాట్లాడుతూ" ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎక్కడా కూడా నేను అంచనాలు పెరిగే విధంగా మాట్లాడలేదు. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ రోజు తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నాను. ఈ చిత్రం వందరోజుల పండుగను అక్టోబర్ 12న చేస్తాం. సినిమా విజయంపై మాకున్న నమ్మకానికి ఇది తార్కాణం అన్నారు. ఈ రోజు నేను నిర్మాతగా మారటానికి కారణమైన నాగార్జునకు, కథానాయిక అనుష్కకు నేను జీవితాంతం రుణపడి వుంటాను' అన్నారు.
అనుష్క భూమిక సముద్ర నాగార్జున తకిట తకిట కింగ్ అరుంధతి anushka bhoomika samudra nagarjuna takita takita king arundhati


Click it and Unblock the Notifications