»   » 'టాప్ లేచిపోద్ది' అంటూ తెలుగులో దీపిక పదుకోని, ఇంకేమంది? (వీడియో)

'టాప్ లేచిపోద్ది' అంటూ తెలుగులో దీపిక పదుకోని, ఇంకేమంది? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యస్..దీపికపదుకోని ..తెలుగులో టాప్ లేచిపోద్ది అంటున్నమాట నిజమే. అయితే ఆమె డబ్బింగ్ వాయిస్ అది. హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవటం కామనే. అలాంటిది మన నటులు నటించిన హాలీవుడ్ చిత్రాలని ఎందుకు వదులుతారు. రీజనల్ లాంగ్వేజెస్ లో కి డబ్ చేసి సొమ్ము చేసుకుంటారు.

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోని రీసెంట్ గా 'xXx-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌' ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ ని సైతం రిలీజ్ చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీపిక ఎఫెక్టుతో ఇండియాలోనూ ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు దీపిక బాలీవుడ్‌లో చేసిన సినిమాలు ఓ ఎత్తైతే ఈ చిత్రం మరో ఎత్తు. సెరీనా ఉంజర్‌ పాత్రలో దీపిక పదుకోన్ కనిపించబోతోంది. సినిమాలోని పలు సన్నివేశాల్లో హీరో విన్‌ డీజిల్‌తో పోటీ పడుతూ దీపిక పదుకోన్ నటించింది.

దీపికకు ఇదే తొలి హాలీవుడ్ మూవీ. ఈ సినిమా ద్వారా హాలీవుడ్లో పాగావేయాలని, మరిన్ని హాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవాలని నిర్ణయించుకున్న దీపిక.... హాలీవుడ్ స్థాయిలో రొమాంటిక్ సీన్లు పండించేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర హీరో విన్ డీసెల్ తో కలిసి హాటెక్కించేలా ఇంటిమేట్ సీన్లలో నటిస్తోంది.

డీజే కరుసో తెరకెక్కించిన ఈ చిత్రం 2017 జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో దీపిక-విన్ డీజిల్ తో పాటు టోనీ జా.. శామ్యూల్ జాక్సన్.. టోనీ కొలెట్.. నినా డొబ్రెవ్.. రూబీ రోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Deepika Padukone has acted in Hollywood action thriller 'xXx: Return of Xander Cage'. The film is set for release in Telugu, English and Hindi languages. Here is the Telugu trailer. Hear how Deepika says Top Lechipoddi in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu