»   » దీపిక హాలీవుడ్ మూవీ ‘xXx’ టీజర్

దీపిక హాలీవుడ్ మూవీ ‘xXx’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ 'xXx-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది. మరో రెండు రోజుల్లో అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీపిక తన ఇన్‌‍స్టాగ్రామ్ ద్వారా టీజర్ షేర్ చేసారు. మీరూ ఓ లుక్కేయండి

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కేవలం దీపిక ముఖంతో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం గమనార్హం. 'మంచి మగాళ్ల మీద తనకు నమ్మకం లేదు' అని దీపిక అభిప్రాయ పడ్డట్లు ఈ పోస్టర్ ఉంది.

ఈ పోస్టర్ బట్టి సినిమాలో దీపిక పదుకోన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్ కూడా డిఫరెంటుగా ఉంది. బాలీవుడ్లో తన సెక్సీ అందాలతో అదరగొట్టిన దీపిక ఈ హాలీవుడ్ మూవీలో తన అందంతో పాటు యాక్షన్ సీన్లతో అదరగొట్టబోతోంది.

ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాకు డీజే కరుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపిక-విన్ డీజిల్ తో పాటు టోనీ జా.. శామ్యూల్ జాక్సన్.. టోనీ కొలెట్.. నినా డొబ్రెవ్.. రూబీ రోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Vin Diesel, Deepika Padukone starrer XXX: The Return of Xander Cage Official Teaser released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu