»   » యమలీల-2 సెట్లో సెలబ్రేషన్స్ (ఫోటో)

యమలీల-2 సెట్లో సెలబ్రేషన్స్ (ఫోటో)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో క్రిష్వీ ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం 'యమలీల-2'. డా. కె.వి.సతీష్ కథానాయకుడిగా దియానికోలస్ కథానాయికగా నటిస్తున్నారు. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం నటిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని దక్కన్ పార్కులో జరుగుతోంది.

  ఈ సందర్భంగా యూనిట్ సభ్యులైన కో డైరెక్టర్ కుర్రా రంగారావు, ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ వెంకటేష్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ వెంకట్రావ్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ మణి, లైట్ మెన్స్ గోపి శ్రీనివాస్, నాగసూరిలకు సంబంధించిన పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో డిఎస్ మాక్స్, క్రిష్వీ ఫిలిమ్స్ చైర్మన్, హీరో డా.కె.వి.సతీష్, డిఎస్ మాక్స్ డైరెక్టర్ ఆశా సతీష్, దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి, కో ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్, హీరోయిన్ దియానికోలస్ పాల్గొన్నారు.

  Yamaleela 2 unit birthday celebrations

  సినిమా గురించి దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ- యమలీల చేసిన 20 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టంగా రూపొందించానని, అయితే ఆ చిత్రానికి ఈ చిత్రానికి కథాపరంగా ఎటువంటి సంబంధం ఉండదని, కొత్త తరహాగా చేసిన ఈ కథలో మోహన్‌బాబు, బ్రహ్మానందం నవ్వులు పూయిస్తారని తెలిపారు. సింహభాగం హైలెట్స్‌లో నిండిన ఈ చిత్రానికి యండమూరి రాసిన ఇడ్లీ-వడ-సాంబారు అనే కథ ప్రేరణగా నిలుస్తుందని, ఓ మామూలు వ్యక్తి కష్టపడి ఏదైనా సాధించగలడు అనే విషయాన్ని కథానాయకుడు నిరూపిస్తాడని తెలిపారు.

  కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావూ రమేష్, సదా, నిషా కొఠారి, ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే, గీతాంజలి, బేబి హర్షిత, అనంత్, సమీర్, ఉత్తేజ్, జోగిబ్రదర్స్, తా.రమేష్, లక్ష్మణ్, సూర్య, సుభాష్, మాధవి, సత్యకృష్ణ, ప్రియ, పార్వతి, ప్రణీత్, విజయ్, సాత్విక్, కావ్య, బాంధవి, వర్షిత, శ్రావణి, దీక్షితులు, కోటేశ్వరరావు, కృష్ణకాంత్, చంటి, రాఘవ, అజయ్ ఘోష్, బండ రమేష్, సాయి, నానా శ్రీధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్:గౌతంరాజు, మాటలు:గంగోత్రి విశ్వనాధ్, భవాని ప్రసాద్, నిర్మాణం:క్రిష్వీ ఫిలింస్, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం:ఎస్.వి.కృష్ణారెడ్డి.

  English summary
  Yamaleela-2 unit members celebrated their birthday on sets. Popular Director S.V. Krishna Reddy is making a film titled Yamaleela-2 on the banner Krishvi Films. K. Atchi Reddy is presenting it in the name of his wing Manisha films along with DS Max. Dr. K.V. Satish is playing lead whereas Collection King Mohan Babu taking the role of Yama. Brahmanandam has set to thrill audience once again as Chitragupta.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more